ETV Bharat / crime

Fake currency: రూ.6 లక్షల నకిలీ నగదు పట్టివేత

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నకిలీ నోట్లు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించి.. దానితో సంబంధం ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Fake currency caught in sangareddy District

author img

By

Published : May 30, 2021, 11:05 AM IST

సైబరాబాద్ కమిషనరేట్ పరిధి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ సమీపంలో లాక్ డౌన్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద… దొంగనోట్లు తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒంగోలుకు చెందిన శివనారాయణ రెడ్డి దాదాపు రూ.6 లక్షల ఫేక్ కరెన్సీతో పట్టుబడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా... దీంతో సంబంధం ఉన్న అంబర్ పేటకు చెందిన తిమ్మనాయుడు, సరూర్ నగర్​కు చెందిన లలిత పేర్లు చెప్పడంతో వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఒకటే అసలు నోటు..

రెండు వేల నోట్ల కట్టలపై ఒక అసలు నోటు పెట్టి కింద అన్ని నకిలీ నోట్లతో చలామణి చేసేందుకు తీసుకెళ్తన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ముగ్గురిని రిమాండ్​కు తరలించి.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.