తుపాకులతో బెదిరించి దోపిడీల(Fake Maoists Arrested)కు పాల్పడుతున్న నలుగురు సభ్యులతో కూడిన మాజీ మావోయిస్టు ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. వీరి నుంచి మూడు తుపాకులు, ఓ నాటు తుపాకి, ఆరు డిటోనేటర్లు, 15 గ్యాస్ సిలిండర్లు, 40గ్రాముల గన్‌పౌడర్, మావోయిస్టుల లెటర్ హెడ్స్, డ్రిల్లింగ్ మిషిన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని మహేశ్ భగవత్ వెల్లడించారు.
వీరు యాదాద్రి శివారు ప్రాంతాల్లో దారి దోపిడీలు(Fake Maoists Arrested), దుకాణాల్లో బెదిరింపులకు పాల్పతుంటారని సీపీ పేర్కొన్నారు. ఇంటిలిటెన్స్ శాఖాధికారులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులతో కలిసి అరెస్టు చేశామన్నారు. అరెస్టయిన వారంతా గతంలో అప్పటి పీపుల్స్ వార్, జనశక్తి పార్టీలో పని చేశారని తెలిపారు. ప్రధాన నిందితుడు పిట్టల శ్రీనివాస్‌కు తుపాకి తయారు చేయడంలో నేర్పరి అని సీపీ తెలిపారు. వల్లాల నాగమల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి, గంగాపురం స్వామి, అశోక్‌లు బెదిరింపులకు పాల్పడుతుంటారని సీపీ పేర్కొన్నారు.
నాగమల్లయ్య గతంలో ఓ హత్య కేసులో నిందితుడని... పీపుల్స్‌వార్, జనశక్తిలో పనిచేశాడన్నారు. శ్రీనివాస్ రెడ్డితో కలిసి నాగమల్లయ్య పనిచేశాడని... పిట్టల శ్రీనివాస్, అతని భార్య పుష్ప కూడా మావోయిస్టులతో కలిసి పనిచేశారని సీపీ వివరించారు. సులభంగా డబ్బు సంపాదించాలని వీరంతా బెదిరింపులకు భూకబ్జాలకు పాల్పడ్డారని ఎస్వోటీ డీసీపీ సురేందర్ రెడ్డి వివరించారు.
- — Rachakonda Police (@RachakondaCop) November 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— Rachakonda Police (@RachakondaCop) November 6, 2021
">— Rachakonda Police (@RachakondaCop) November 6, 2021
ఇదీ చూడండి: మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు: హైకోర్టు