మహారాష్ట్రలో విమానాశ్రయం పరిసరాల్లో రవాణాకు సిద్ధంగా ఉన్న ఎపిడ్రిన్(Epidrin export to australia) దొరికింది. తమిళనాడులో సముద్రతీర ప్రాంతానికి సమీపంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) బృందం చేసిన దాడిలో ఇదే మాదకద్రవ్యం లభ్యమైంది. పలు సందర్భాల్లో ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఆస్ట్రేలియాకు ఎగుమతి(Epidrin export to australia) చేసేందుకే పలు ముఠాలు ప్రయత్నిస్తున్నాయని దర్యాప్తు క్రమంలో తేలుతోంది. ఇలాంటి ఉదంతాల్లో హైదరాబాద్ మూలాలు బహిర్గతమవుతున్నాయి.
తాజాగా ముంబయి అంధేరీలో సుమారు రూ.5 కోట్ల విలువైన ఎపిడ్రిన్(Epidrin export to australia)ను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో హైదరాబాద్‌కు చెందిన ముఠా సభ్యుల పాత్ర ఉందని తేలింది. వీరి పూర్వాపరాలపై ఎన్‌సీబీ బృందం దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ శివారుల్లోని పటాన్‌చెరు, జీడిమెట్ల, పాశమైలారం, అమీన్‌పూర్ తదితర ప్రాంతాల్లో ఎపిడ్రిన్‌ను కొన్ని ముఠాలు గుట్టుగా తయారుచేస్తున్నట్లు పలు ఉదంతాలు నిరూపించాయి.
ఊరిస్తున్న పది రెట్లు లాభం
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. తదితర దేశాల్లో మెథాంపెటమైన్(మెథ్), ఎంపెటమైన్ లాంటి మాదకద్రవ్యాల వినియోగం అధికంగా ఉంటుంది. మెథ్ తయారీలో ఎపిడ్రిన్(Epidrin export to australia) కీలకమైన ముడిసరకు కావడం గమనార్హం. ఎపిడ్రిన్(Epidrin export to australia)ను తయారుచేసే పరిశ్రమలు ఎక్కువగా లేకపోవడంతో అక్కడి ముఠాలు అక్రమ దిగుమతిపై ఆధారపడుతున్నాయి.
ఫార్మా కంపెనీల్లో హైదరాబాద్‌కు దేశవ్యాప్తంగా పేరుండటంతో మాదకద్రవ్య ముడిసరకును హైదరాబాద్‌కు దిగుమతి చేసి.. దాన్ని ఇక్కడ ఎపిడ్రిన్(Epidrin export to australia)గా మార్చి ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నాయి. హైదరాబాద్‌పై ప్రభుత్వ సంస్థల నిఘా ఉంటుందని ముంబయి, చెన్నై, బెంగళూరు, దిల్లీ, కొచ్చి.. తదితర నగరాలకు రోడ్డుమార్గంలో పంపుతున్నాయి. అక్కడి నుంచి విమానాల్లో విదేశాలకు తరలిస్తున్నాయి. హైదరాబాద్‌లో రూ.50 వేల విలువ చేసే ఎపిడ్రిన్ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో రూ.5 లక్షలు పలుకుతుండటం మాదకద్రవ్యాల ముఠాలను ఊరిస్తోంది. ఒక్కసారి విదేశాలకు తరలించగలిగితే రూ.కోట్లు గడించే అవకాశముండటంతో ఈ దందాను కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.