పొలంలో చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి శనివారం ఓ యువకుడు అసువులు(young man dies electric shock) బాశాడు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. తండ్రికి సాయం చేయడానికి పొలానికి వెళ్లిన డిగ్రీ విద్యార్థి గణేశ్ (18) ఈ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. చేతికి అందివస్తున్న చెట్టంత కొడుకును కరెంటు తీగలు కబళించాయని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ తీగలను సరిచేయాలని చాలా రోజులుగా కోరుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడమే యువకుడి మరణానికి కారణమని గ్రామస్థులు ఆగ్రహించారు.
గజ్వేల్-చేగుంట మార్గంలోని గుర్రాలసోఫ వద్ద ఆందోళనకు దిగారు. వర్షం కురుస్తున్నా మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. సర్పంచి చంద్రశేఖర్, తెరాస నాయకులు ఈ విషయాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తనవంతుగా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తానని, రెండు పడక గదుల ఇంటిని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు విద్యుత్తు అధికారులు కూడా రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ఒప్పుకోవడంతో ధర్నా విరమించారు. మృతుడి తండ్రి శ్యాంనాథ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ మహబూబ్ వివరించారు.
ఇటీవలే వేర్వేరు ఘటనల్లో..
మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కరెంటు కాటు(electric shock news 2021)కు నలుగురు బలయ్యారు. వీరిలో దంపతులతో పాటు ఒక రైతు, కూలీ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో విద్యుదాఘాతంతో దంపతులు దుర్మరణం చెందారు. జీకేపేట పంచాయతీలోని సింగారం-2 కాలనీకి చెందిన ఆనపర్తి తిరుపతమ్మ(28) స్నానానికి వెళ్లొచ్చి.. తువ్వాలును ఇనుపతీగపై ఆరేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ దండేనికి విద్యుత్ సరఫరా అవుతుండటంతో షాక్ కొట్టి ఆమె కేకలు వేశారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో భర్త ఉపేందర్(32) కూడా విద్యుదాఘాతానికి(electric shock news 2021) గురయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఐదు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలున్నారు.
మోటారు బంద్ చేద్దామని వెళ్లి..
మహబూబాబాద్ మండలం సింగారం శివారు ఇస్లావత్ తండా పంచాయతీ పరిధి వెంకట్రామ్తండాకు చెందిన ధరావత్ హరిసింగ్(32) గురువారం సాయంత్రం చెరువు సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలి మృతి(electric shock news 2021) చెందారు. వ్యవసాయ బావి మోటారును బంద్ చేసేందుకు వెళ్లి ఆయన ప్రమాదానికి గురయ్యారు.
హీటర్ తాకి మహిళా కూలీ..
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్‌లో సుమత(36) అనే మహిళా కూలీ విద్యుదాఘాతంతో మరణించారు. కార్తికపౌర్ణమి పర్వదినం కావడం వల్ల ఇంటిని శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ హీటర్‌కు తాకి కన్నుమూశారు. కార్తిక పౌర్ణమి రోజున వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతి చెందడం.. వారి కుటుంబాల్లో విషాదం నింపింది.
- ఇదీ చదవండి : TRS dharna: తెరాస ఫ్లెక్సీలు కడుతుండగా అపశృతి.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి