ETV Bharat / crime

కాపలా ఉంచితే కాటేశాడు.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం - వనపర్తిలో మైనర్ బాలికపై అత్యాచారం

Minor Girl Rape in Wanaparthy : వాళ్లంతా కూలీ పని చేసుకుని బతికే వారు. తెల్లవారగానే పనులకు వెళ్తారు. వారికి వంట చేయడానికి.. వారి పిల్లలకు కాపలాగా ఓ వ్యక్తిని ఉంచారు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోమని కాపలా పెట్టిన ఆ వ్యక్తే తమ కన్నబిడ్డ పాలిట కీచకుడవుతారని ఊహించలేకపోయారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన తర్వాత ఎనిమిదేళ్ల బాలికపై ఆ కీచకుడు మృగంలా మారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనకి ఏం జరుగుతుందో అర్థం కాని ఆ చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడి నిందితుడే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

Minor Girl Rape in Wanaparthy
Minor Girl Rape in Wanaparthy
author img

By

Published : Apr 21, 2022, 8:20 AM IST

Updated : Apr 21, 2022, 10:32 AM IST

Minor Girl Rape in Wanaparthy : రైల్వే విద్యుద్దీకరణ పనులు చేయడానికి వలస వచ్చిన కూలీల కుటుంబాలకు వంటలు చేస్తూ, వారి పిల్లలకు కాపలాగా ఉంటున్న వ్యక్తే అభం, శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్యులకు చూపించాడు. పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగిందని గుర్తించి పూర్తి వివరాలు ఆరా తీయగా నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో బుధవారం కలకలం రేపింది.

ఎస్సై మంజునాథరెడ్డి కథనం ప్రకారం.. మదనాపురం మండలం రామన్‌పాడ్‌ సమీపంలోని రైల్వేట్రాక్‌ విద్యుద్దీకరణ పనులు చేసేందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ బాలిక (8) కుటుంబంతో పాటు పలువురు వచ్చారు. వీరికి వంటలుచేసి పెట్టడానికి పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్‌ మచ్చాన్‌ (50) కుటుంబంతో పాటు వలస వచ్చాడు. వీరంతా మదనాపురం సమీపంలోనే గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. పెద్దలంతా పనులకు వెళ్లిపోతే మచ్చాన్‌ వారి పిల్లలకు ఇంటి వద్ద కాపలాగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో ఇంటి దగ్గర ఉన్న చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారికి రక్తస్రావమైంది. దీంతో భయాందోళన చెందిన నిందితుడు వెంటనే చిన్నారిని మదనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. వైద్యులు చిన్నారిపై అత్యాచారం జరిగిందని నిర్ధరించి మెరుగైన చికిత్స కోసం వనపర్తి జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించి అసలేం జరిగిందని నిలదీశారు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా మచ్చాన్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. మధ్యాహ్నం రామన్‌పాడ్‌ గ్రామంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని విచారణ చేస్తున్నట్లు ఎస్సై మంజునాథరెడ్డి చెప్పారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 21, 2022, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.