ETV Bharat / crime

అడ్డంగా దొరికిపోయి.. పోలీసుకే మంటెక్కించిన మందుబాబు.. ఫలితంగా.. - రోడ్డుపై మందుబాబు హల్​చల్​

Drunken Man Hulchul: డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో పోలీసులకు అడ్డంగా దొరికిపోవటం.. మత్తులో రోడ్డుపై హల్​చల్​ చేయటం.. వార్తల్లో నిలవటం.. ఈ మధ్య పరిపాటిగా మారిపోయింది. కాగా.. ఓ మందుబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. అందరి దృష్టిలో పడకూడదని చేసిన ప్రయత్నం విఫలమై.. వార్తల్లో నిలిచాడు. అసలు ఆ మందుబాబు ఏం చేశాడంటే..?

Drunken Man Hulchul and tried to escape from police at miyapur

author img

By

Published : Aug 3, 2022, 8:48 PM IST

అడ్డంగా దొరికిపోయి.. పోలీసుల దెబ్బ రుచిచూసిన మందుబాబు..

Drunken Man Hulchul: మద్యం సేవించి వాహనాలు నడపకండి అని పోలీసులు ఎంత మొత్తుకున్నా లాభం లేకుండా పోతోంది. మందుబాబులు కేవలం మత్తును తప్ప పోలీసుల మాటలకు కొంచెం కూడా (చెవికి)ఎక్కించుకోవట్లేదు. ఫలితంగా.. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో అడ్డంగా బుక్కవుతున్నారు. అక్కడితో ఆగుతున్నారా..? అంటే కొంత మంది కిక్కురాయుళ్లు.. పోలీసులపైకి ఎగబడుతున్నారు. మత్తులో రోడ్డు మీద నానా రచ్చ చేస్తున్నారు. వాళ్లు చేసే రచ్చతో చిర్రెత్తిపోతున్న కొందరు పోలీసులు.. చేతివాటం చూపించక తప్పట్లేదు. కట్​ చేస్తే.. ఈ హంగామా మొత్తం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారుతోంది. ఇక్కడ కూడా.. ఓ మందుబాబు పోలీసు దెబ్బ రూచి చూశాడు.

మంగళవారం రాత్రి మియాపూర్​ ట్రాఫిక్​ పోలీసులు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నరసింహరావు అనే వ్యక్తికి.. బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా మద్యం తాగినట్లు నిర్ధరణైంది. కాగా.. పోలీసులు నరసింహరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నరసింహరావు.. అక్కడి నుంచి పరుగెత్తాడు. గమనించిన పోలీసులు.. నరసింహరావును వెంబడించి పట్టుకున్నారు. వెంటపడి మరీ పట్టుకున్నందుకు గానూ.. ఆ పోలీసుపై నరసింహరావు దుర్భాషలాడాడు.

అసలే తనను పరిగెత్తించినందుకు కోపంతో ఉన్న పోలీసు.. నరసింహరావు నోటివెంట బూతులు వినగానే మంటెక్కిపోయాడు. వెంటనే కోపంతో ఊగిపోయిన పోలీసు.. తన చేతి దెబ్బ రుచి చూపించాడు. దెబ్బ పడేటప్పుడు కూడా మందుబాబు.. పోలీసును బెదిరించాడు. ఇంకేముంది.. ఒక్క దెబ్బతో పోయేది.. మూడు దెబ్బల దాకా తెచ్చుకున్నాడు. ఇంత రచ్చ చేసిన మందుబాబుపై మియాపూర్​ ట్రాఫిక్​ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. నరసింహారావు డ్రంక్ అండ్ డ్రైవ్​లో పట్టుబడటం ఇది రెండోసారి మరీ.. అందుకే పోలీసులు అతడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చిందన్నమాట..!

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.