ETV Bharat / crime

పొద్దుపొద్దున్నే మందుబాబు హల్చల్​​.. బ్రీత్​ అనలైజర్​ టెస్ట్​లో రికార్డు స్కోర్​.. - పొద్దుపొద్దున్నే మందుబాబు హల్చల్

Drunkard Hulchal: హైదరాబాద్‌లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. తెల్లవారుజామునుంచే మత్తులో తూగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇప్పటివరకు రాత్రివేళల్లోనే రచ్చ చేసే తాగుబోతులు.. ఇప్పుడు పొద్దుపొద్దున్నే మొదలుపెట్టేస్తున్నారు. దర్జాగా మత్తులో రోడ్లెక్కేసి బీభత్సం సృష్టిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో తెల్లవారుజామున కారుతో హల్​చల్​ చేసిన వ్యక్తిని పరిశీలించగా.. ఏకంగా 233 పాయింట్లు స్కోర్​ చేసి పోలీసులకే షాకిచ్చాడు.

Drunkard Hulchal with car in jubileehills check post in the morning

author img

By

Published : Mar 29, 2022, 3:40 PM IST

Drunkard Hulchal:హైదరాబాద్‌లో మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ను కట్టడి చేసేందుకు పోలీసులు ఇన్ని రోజులు రాత్రుల్లే తనిఖీలు నిర్వహించారు. ఇప్పుడు.. రోజంతా నిర్వహించాలేమో.. అన్న సందేహం కలిగేలా చేస్తున్నారు. దానికి కారణం.. ఓ మందుబాబు పొద్దున్నే కారుతో హల్​చల్​ చేశాడు. తీరా అతడికి బ్రీథ్ అనలైజర్​ టెస్ట్​ చేస్తే.. ఏకంగా డబుల్ సెంచరీ బాది అందరిని అవాక్కయ్యేలా చేశాడు. ఇన్ని రోజులు రాత్రివేళలకే పరిమితమైన మందుబాబుల రచ్చ.. ఉదయం వేళల్లోనూ మొదలైంది. జూబ్లిహిల్స్ చెక్​పోస్టు వద్ద ఇవాళ ఉదయం ఓ కారు.. రెండు ఆటోలను ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్​ను పోలీసులు పరీక్షించి అవాక్కయ్యారు. పొద్దుపొద్దునే ఏకంగా 233 పాయింట్లు చూపించడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నగరంలో అడుగడుగునా పోలీసులు తనిఖీలు చేస్తున్నా.. మందబాబులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్న పోలీసులు.. మందుబాబుల ఆగడాలు అరికట్టేందుకు నిత్యం శ్రమిస్తున్నారు. పోలీసుల చెక్‌పాయింట్లను గుర్తించి.. మందుబాబులు తప్పించుకు తిరుగుతుండటంతో.. ఊహించని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రత్యేక బృందాలను కేటాయించి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడుతున్నారు. అయినా మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇక నుంచి డ్రంక్​ అండ్​ డ్రైవ్​లను కట్టడి చేయాలంటే.. తనిఖీలు రోజంతా నిర్వహించాలేమో..? అప్పుడైనా మందుబాబులు రోడ్డెక్కకుండా అదుపులో ఉంటారేమో..?

పొద్దుపొద్దున్నే మందుబాబు హల్చల్​​.. బ్రీత్​ అనలైజర్​ టెస్ట్​లో రికార్డు స్కోర్​..

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.