ETV Bharat / crime

Drunkard hulchal: పట్టపగలే చుక్కలు చూపించిన మందుబాబు.. పోలీసులతో వాగ్వాదం..

Drunkard hulchal: డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో పట్టుబడ్డ ఓ వ్యక్తి నానా రచ్చ చేశాడు. పోలీసులు చెప్పిన మంచి మాట వినకుండా.. వాగ్వాదానికి దిగాడు. మత్తులో కారు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులకే ఆగ్రహం తెప్పించాడు. ఇదంతా జరిగింది ఏ రాత్రో కాదండీ.. పట్టపగలే..!

Drunkard hulchal in drunk and drive test at mahaboobabad

author img

By

Published : Jan 18, 2022, 7:45 PM IST

పట్టపగలే చుక్కలు చూపించిన మందుబాబు..

Drunkard hulchal: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మందుబాబు హల్​చల్​ చేశాడు. మద్యం తాగి కుటుంబంతో కలిసి కారులో వెళ్తూ.. డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో పట్టుబడి పోలీసులకు చుక్కలు చూపించాడు. మద్యం తాగి కారు నడపకూడదని ఎంత చెప్పిన వినిపించుకోకుండా.. నానా యాగి చేశాడు. పట్టణంలో ట్రాఫిక్ ఎస్సై గాలిబ్ తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న ఓ కారును ఆపి డ్రైవింగ్​ చేస్తున్న వ్యక్తిని​ పరీక్షించగా.. మద్యం సేవించినట్టు తేలింది. ఆ వ్యక్తిపై డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసు నమోదు చేసి జరిమానా విధించారు. కారులో మిగతావాళ్లు మహిళలే ఉండటంతో.. వారికి డ్రైవింగ్​ రాకపోవటం వల్ల అందరూ వేరే వాహనంలో వెళ్లాలని పోలీసులు సూచించారు.

పోలీసుల సూచనకు ఒప్పుకోని మందుబాబు ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా.. మత్తులో నానా రచ్చ చేశాడు. వేరే వాహనంలో వెళ్లేందుకు ససేమిరా అనటంతో.. వేరే ప్రైవేటు డ్రైవర్​ను మాట్లాడారు. మందుబాబు వద్ద మొబైల్​​ లాక్కున్న పోలీసులు.. కోర్టుకు వచ్చి తీసుకుపోవాలని సూచించారు. డ్రైవర్​ను మాట్లాడాక ఇవ్వాలని మహిళలు సైతం వాగ్వాదం పెట్టుకున్నారు. కోర్టుకు హాజరై తీసుకోవాలని ఎంత చెప్పిన వినకపోవటంతో పోలీసులు ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే ప్రైవేటు డ్రైవర్​ను ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.