ETV Bharat / crime

లైవ్​ వీడియో: మద్యం మత్తులో 220 కేవీ విద్యుత్​ టవర్​ ఎక్కి హల్​చల్​ - మద్యం మత్తులో విద్యుత్​ టవర్​ పై హల్​చల్​

భూ పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి విద్యుత్​ టవర్​ ఎక్కి హల్​చల్​ చేశాడు. మద్యం మత్తులో 220 కేవీ టవర్​ పైకెక్కి కూర్చున్నాడు. విద్యుత్​ సరఫరా ఉండటం వల్ల అతడిని కిందకి దింపేందుకు అధికారులు, స్థానికులు నానా ప్రయాసలు పడ్డారు. చివరికి అతడే తనంతట తానుగా దిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

nagarkurnool district
man climbs up an electric tower
author img

By

Published : Mar 29, 2021, 7:16 PM IST

Updated : Mar 29, 2021, 10:28 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండలో ఇమామ్​ అనే వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్​ టవర్​ ఎక్కి హల్​చల్​ చేశాడు. భూ పంపకాలలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ 220 కేవీ విద్యుత్​ టవర్​ ఎక్కాడు. గ్రామస్థులు ఎంతలా బతిమాలినా కిందకు దిగలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అతడిని కిందకు దింపేందుకు నానా తంటాలు పడ్డారు. నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. భూ పంపకాలు మళ్లీ చేస్తామని చెప్పారు. అయినా వినిపించుకోలేదు. విస్తుపోయిన అధికారులు, గ్రామస్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎట్టకేలకు సుమారు 4 గంటల తర్వాత ఇమామ్ తనంతట తానే కిందకు దిగొచ్చాడు. ఇంతలో జనాలు తిరిగి అక్కడికి చేరుకోవడంతో కొద్ది పైభాగంలో భీష్మించుకుని కూర్చున్నాడు. ఇంతలో జెన్కో రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. వారిని గమనించిన యువకుడు తిరిగి టవర్​పైకి ఎక్కే ప్రయత్నం చేయగా.. టీం సభ్యులు వెంటనే స్పందించి అతడిని కిందికి దించారు.

ఇదీ చూడండి: ట్రాక్టర్​ బోల్తా.. ఓ వ్యక్తి మృతి, 12 మందికి గాయాలు

Last Updated : Mar 29, 2021, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.