ETV Bharat / crime

Drugs Seized at ORR: డ్రగ్స్‌ పంచుకుంటుండగా.. పోలీసుల ఎంట్రీ.. ముగ్గురు అరెస్ట్‌ - తెలంగాణ వార్తలు

Drugs Seized at ORR: హైదరాబాద్‌ శివారులో మత్తుపదార్థాలు పంచుకుంటున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు తెలిపారు. వీరిలో ఓ మహిళ సైతం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరి నుంచి 9.4 గ్రాముల మత్తు పదార్థాలు, కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Drugs Seized at ORR
Drugs Seized at ORR
author img

By

Published : Dec 16, 2021, 10:28 AM IST

Drugs Seized at ORR: ఆ ముగ్గురు ఆన్‌లైన్‌లో స్నేహితులయ్యారు. తరచూ పబ్‌లో కలుసుకునే వారు.. మత్తు మందుకు అలవాటు పడ్డారు. గోవాలో కొనుగోలు చేసిన డ్రగ్స్‌ పంచుకుంటున్న వేళ రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఘట్‌కేసర్‌ ఠాణా పరిధి ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో మంగళవారం సాయంత్రం కారులో మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో... అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు, నేర విభాగం సీఐ కె.జంగయ్య తెలిపారు. వారిలో మెహిదీపట్నం విజయ్‌నగర్‌కాలనీకి చెందిన హార్మోని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మహమ్మద్‌ జమీర్‌ సిద్ధిఖ్‌(28), హఫీజ్‌పేట్‌ గోపాల్‌నగర్‌లోని శ్రీ రెసిడెన్సీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పులి రమ్య(32), అల్మాస్‌గూడ శేషాద్రినగర్‌లో నివాసముంటున్న కౌకుంట్ల అఖిల్‌(31)గా గుర్తించారు.

వారి వద్ద నుంచి వివిధ రకాల 9.4 గ్రాముల డ్రగ్స్‌తో పాటు గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నట్లు సీఐలు పేర్కొన్నారు. ఈ ముగ్గురు ‘క్లబ్‌ హౌస్‌’ అనే ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా పరిచయమయ్యారు. యాప్‌లో డ్రగ్స్‌ గురించి చర్చించేవారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో తరచూ కలుసుకునే వారు. కౌకుంట్ల అఖిల్‌ గోవా వెళ్లి డ్రగ్స్‌ కొనుగోలు చేసి వచ్చేవాడు. దాన్ని మిగతా ఇద్దరికి ఇచ్చేవాడు. డిసెంబరు 31 రాత్రి వేడుకలు చేసుకునేందుకు జమీర్‌ సిద్ధిఖ్‌, పులి రమ్య ఈ నెల 9న గోవాకు వెళ్లి డ్రగ్స్‌ కొన్నారు. మంగళవారం అఖిల్‌కు డ్రగ్స్‌ ఇస్తున్న సమయంలో పోలీసులకు చిక్కారు.

ఇదీ చదవండి: Rape Attempt on Disabled: నడవలేని అమ్మాయిపై తాత వయసున్న వ్యక్తి అత్యాచారయత్నం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.