Drug Dealer Tony Custody Ends: మాదక ద్రవ్యాల కేసు ప్రధాన నిందితుడు టోనీ కస్టడీ ముగిసింది. పంజాగుట్ట పోలీసులు వైద్య పరీక్షలు అనంతరం అతడిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అక్కడి నుంచి చంచల్ గూడా జైలుకు తరలించారు. 5 రోజుల పాటు టోనీని ప్రశ్నించిన పోలీసులు.. డ్రగ్స్ దందాపై కీలక విషయాలు రాబట్టారు.
Drug Dealer Tony Custody Ends Today : వ్యాపార వేత్తలకు డిమాండ్ మేరకు టోనీ మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు గుర్తించారు. విదేశాలకు హవాలా రూపంలో డబ్బును తరలించినట్లు గుర్తించారు. టోనీతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని విచారిస్తున్నారు. ప్రధాన ఏజెంట్ ఇమ్రాన్ భార్య ఫిర్దోస్‌ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. వీరిని ఇవాళ రిమాండ్ చేసే అవకాశం ఉంది.