ETV Bharat / crime

డ్రగ్స్​​ మోతాదు ఎక్కువై ఇంజినీరింగ్​ విద్యార్థి మృతి.. రాష్ట్రంలోనే ఫస్ట్​ టైం..! - Engineering student Died with brain stroke

Drug addicted Young man died with brain stroke in hyderabad

author img

By

Published : Mar 31, 2022, 5:16 PM IST

Updated : Mar 31, 2022, 10:20 PM IST

17:14 March 31

డ్రగ్స్‌ తీసుకుంటుండగా మోతాదు ఎక్కువై బీటెక్‌ విద్యార్థి మృతి..

drug-addicted-young-man-died-with-brain-stroke-in-hyderabad
ఇంజినీరింగ్​ విద్యార్థి ఒకటే సారి తీసుకున్న డ్రగ్స్​ ఇవే..

Engineering student Died: హైదరాబాద్‌లో డ్రగ్స్ మోతాదు ఎక్కువై తొలి మరణం సంభవించింది. మదాకద్రవ్యాలకు బానిసైన ఇంజినీరింగ్​ విద్యార్థి.. డ్రగ్స్‌ తీసుకుంటుండగా మోతాదు ఎక్కువై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రెండ్రోజుల క్రితం నల్లకుంట పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని, వినియోగిస్తోన్న ముగ్గురిని అరెస్టు చేసి విచారించగా... ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

స్నేహితులతో గోవా వెళ్లి..: మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్‌ పోలీసులు.. రెండు కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు. అందులో భాగంగానే.. రెండ్రోజుల క్రితం నల్లకుంట పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ్‌ ఉపాధ్యాయ్​ అనే వ్యక్తిని పోలీసుల అరెస్టు చేశారు. అతడి వద్ద డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న ప్రేమ్ తనకున్న పరిచయాలతో మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. అందుకు లక్ష్మీపతి అనే గంజాయి వ్యాపారి నుంచి హాష్ ఆయిల్ తెప్పించుకుని సేవించాడు. అనంతరం.. తనని సంప్రదిస్తున్న వారికి దాన్ని కమీషన్​పై అమ్మడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు, ఉద్యోగాలు చేసే యువకులు ప్రేమ్​కు పరిచయమయ్యారు. వారికోసం హాష్ ఆయిల్​ను తెప్పించేవాడు. దీనితో పాటు గోవాలో ఎల్‌ఎస్‌డీ, ఎక్ట్సాస్టీ వంటి మత్తుపదార్థాలు సరఫరా చేసే వారితో పరిచయం ఏర్పర్చుకున్నాడు. అనంతరం స్నేహితులను తీసుకుని తరచూ.. గోవా వెళ్లి డ్రగ్స్ సేవిస్తున్నారు. ఇతనితో పాటు మొత్తం 12 మంది యువకులు డ్రగ్స్​ సేవించేందుకు గోవాకు వెళ్తున్నారు.

మోతాదుకు మించి..: ఇలా మత్తుపదార్థాలకు బానిసైన వారి స్నేహితుడే ఈ బీటెక్​ విద్యార్థి. అరెస్టయిన నలుగురితో కలిసి మరో బీటెక్‌ విద్యార్థి గోవా వెళ్లాడు. సదరు విద్యార్థి.. వివిధ రకాల డ్రగ్స్​ను ఒకేసారి సేవించాడు. మోతాదు ఎక్కువై విద్యార్థికి మెదడు స్తంభించి వింతగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఈ నెల 19న యువకున్ని నిమ్స్​ ఆస్పత్రిలో చేర్పించారు. అతడికి చికిత్స అందించిన వైద్యులకు యువకుడి పరిస్థితి ఎంటో అర్థం కాలేదు. విద్యార్థి స్నేహితులను పిలిచి విషయం తెలసుకోగా.. ఎల్‌ఎస్‌డీతో పాటు మద్యం, కెనలబిస్ సేవించాడని తెలిపారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంపాలైన యువకునికి బ్రెయిన్​ స్ట్రోక్​ వచ్చి.. శరీరంలోని అవయవాలన్ని పనిచేయటం మానేశాయని వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూనే ఈనెల 23న యువకుడు మృతి చెందారు. కొన్నేళ్లుగా మత్తుపదార్థాలు సేవిస్తుండటం వల్లే తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని వైద్యులు పేర్కొన్నారు.

కొన్నేళ్లుగా డ్రగ్స్​ సేవించటం వల్లే..

"ఈ నెల 19న ఆస్పత్రి(నిమ్స్​)లో అతని తండ్రి ఆస్పత్రిలో చేర్పించారు. మొదట అబ్బాయి పరిస్థితి ఎంటో అర్ధం కాలేదు. అతడు డ్రగ్స్​ తీసుకుంటాడని చెప్పలేదు. అబ్బాయి స్నేహితులను పిలిచి విషయం తెలసుకుంటే.. ఎల్‌ఎస్‌డీతో పాటు మద్యం, కెనలబిస్ సేవించాడని తెలిపారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంపాలైన యువకునికి బ్రెయిన్​సో​ స్ట్రోక్స్ వచ్చాయి. విచిత్ర ప్రవర్తనతో పాటు శరీర అవయవాలు పనిచేయడం మానేశాయి. 23న యువకుడు మృతి చెందాడు. కొన్నేళ్లుగా డ్రగ్స్​ సేవిస్తుండటం వల్లనే పేషంట్​ తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు." - విద్యార్థికి చికిత్స అందించిన వైద్యులు, నిమ్స్​ ఆస్పత్రి

మత్తు సరిపోలేదని..

"నగరానికి చెందిన యువకుడు అతిగా డ్రగ్స్ తీసుకుని బ్రెయిన్​ స్ట్రోక్​కు గురై.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నల్లకుంట పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి నుంచి నగరానికి చెందిన యువకులు మత్తు పదార్ధాలు సేవించేందుకు గోవా వెళ్తుంటారు. అలాగే గోవా వెళ్లిన విద్యార్థి.. మత్తు సరిపోలేదని వివిధ రకాల డ్రగ్స్​ను ఒకేసారి సేవించాడు. దీంతో బ్రెయిన్​ స్ట్రోక్​ వచ్చి.. రెండు రోజుల క్రితం మృతి చెందాడు. మాదకద్రవ్యాలను కట్టడి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. బలవంతంగా డ్రగ్స్‌ అలవాటు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. పరారీలో ఉన్న కీలక నిందితుడిని కూడా త్వరలోనే పట్టుకుంటాం." - డీఎస్‌ చౌహాన్‌, హైదరాబాద్ శాంతి భద్రతల అదనపు సీపీ

ప్రస్తుతం ప్రధాన నిందితుడు ప్రేమ్ ఉపాధ్యాయ్​తో పాటు ముగ్గురు వినయోగదారులను అరెస్ట్ చేసిన పోలీసులు.. హాష్ ఆయిల్ విక్రయిస్తున్న లక్ష్మీపతి కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్న లక్ష్మీపతి.. గంజాయితో పాటు హాష్ ఆయిల్​ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడి కాల్ డేటాలో మరికొంత మంది విద్యార్థులు ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ప్రేమ్ ఉపాధ్యాయ్​ నుంచి మరో 8 మంది మత్తు పదార్థాలు కొనుగోలు చేసి వినియోగించారని.. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి 6 ఎల్ఎస్డీ బోల్ట్స్, 10ఎక్స్టాసీ పిల్స్, 100గ్రాముల హాష్ ఆయిల్, 4 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 31, 2022, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.