ఫైనాన్షియర్ వేధింపులతో హనుమకొండలో ఓ డ్రైవర్ తన ఆటోను తగులపెట్టుకున్నాడు. డబ్బుల కోసం రోజూ ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. కాళోజి కూడలి వద్ద శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసి వాహనానికి నిప్పంటించాడు. నడిరోడ్డుపై ఆటో తగులపడుతుండగా వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఆటో పూర్తిగా కాలిపోయింది.
కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డానని.. కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. గిరాకీ లేదని.. పెట్రోల్ ధరల పెరుగదల వల్ల ఏమీ మిగలడం లేదని గోడు వెల్లబోసుకున్నాడు. ఫైనాన్స్ వాళ్లు కూడా డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆటో డ్రైవర్ వాపోయాడు.
ఇదీ చదవండి: SUSPICIOUS DEATH: పెళ్లి బరాత్‌లో యువకుడి మృతి.. అసలేం జరిగింది?