ETV Bharat / crime

కాన్పు చేసిన ఫోటోలను.. వాట్సాప్​ గ్రూప్​లో పంపిన వైద్యుడు.. అసలు విషయం తెలియడంతో!! - ap latest news

Doctor shared the delivery photos: వైద్యో నారాయణ హరి అంటారు.. వైద్యుడు దైవంతో సమానం అన్నారు మన పెద్దలు.. వైద్యుడి దగ్గర ఏది దాచకూడదంటారు. అయితే ఆ వైద్యుడు కాన్పు కోసం వచ్చిన మహిళ ఫోటోలను ఆరోగ్య శ్రీ యాప్​లో అప్లోడ్ చేయాల్సి ఉండగా.. ఓ పార్టీకి చెందిన వాట్సప్ గ్రూప్​లో షేర్ చేశాడు. ఫోటోలు వైరల్ కావడంతో స్పందించిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విచారణ ప్రారంభించి చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

doctor
డాక్టర్​
author img

By

Published : Oct 5, 2022, 2:44 PM IST

Doctor shared the delivery photos whatsapp: ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని వైద్య వృత్తికే కళంకం తెచ్చే ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వెళ్తే ఆ సమయంలో తీసిన ఫోటోలు ఓ వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టడం కలకలం రేపింది. గత నెల 24 తేదీన జమ్మలమడుగులోని ప్రైవేట్ ఆస్పత్రిలో పురిటినొప్పులతో మహిళచేరింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యులు శస్త్ర చికిత్స చేసి కాన్పు చేశారు.

ఆ మహిళ సర్జరీకి సంబంధించిన ఫొటోలను ఆరోగ్యశ్రీ యాప్​లో అప్​లోడ్​ చేయాల్సి ఉంటుంది . అయితే ఫొటోలను ఆరోగ్యశ్రీ యాప్‌లో కాకుండా పొరపాటున జమ్మలమడుగుకు చెందిన వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేశారు. ఆ ఫొటోలు చూసిన కొందరు వెంటనే ఆసుపత్రి సిబ్బంది, యాజమాన్యానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొన్ని గంటలకే ఆ ఫొటోలను గ్రూప్‌ నుంచి తొలగించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలకు అధికారులు ఆదేశించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.