ETV Bharat / crime

DOCTOR RAPE ATTEMPT: జ్వరమొచ్చిందని ఆస్పత్రికి వెళితే... అత్యాచారం చేయబోయాడు! - తెలంగాణ 2021 వార్తలు

పాపకు జ్వరమొచ్చిందని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లిందో తల్లి. మందులు తెమ్మంటూ తల్లిని బయటకు పంపి.. చిన్నారిపై అత్యాచారం చేయబోయాడో నీతిమాలని వైద్యుడు. పాప ఏడుస్తూ బయటకు పరుగెత్తుకు రావడం చూసిన తల్లి ఆరా తీయగా... అసలు విషయం బయటపడింది.

doctor-attempted-to-rape-on-a-minor-girl-at-medchal
జ్వరమొచ్చిందని ఆస్పత్రికి వెళితే... అత్యాచారం చేయబోయాడు!
author img

By

Published : Aug 4, 2021, 1:31 PM IST

Updated : Aug 4, 2021, 2:13 PM IST

మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యం కోసం వచ్చిన ఓ బాలికపై వైద్యుడే అత్యాచారం చేయబోయాడు. ఈ ఘటన సోమవారం జరగగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సుచిత్ర ప్రాంతానికి చెందిన ఓ బాలిక(16)కు జ్వరం వచ్చింది. మాత్రలు వేసినా జ్వరం తగ్గకపోవడంతో... తల్లి స్థానికంగా ఉన్న ఓ పీఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లింది. చెకప్ పేరిట బాలికను ఒక్కదాన్నే లోపలకు తీసుకెళ్లాడు. కాసేపటికి తల్లిని మాత్రల కోసమని బయటకు పంపాడు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఏడ్చుకుంటూ బయటకు పరుగెత్తుకు రావడంతో... ఆమె తల్లి గమనించింది. ఏమైందంటూ కూతురిని ఆరా తీయగా... అసలు విషయం బయటపడింది.

బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఓ మహిళ పోలీస్ స్టేషన్​కి వచ్చి ఫిర్యాదు ఇచ్చింది. ఆమె కూతురును జ్వరమొచ్చిందని చెప్పేసి జీడిమెట్లలోని ఓ ప్రైవేటు క్లినిక్​కు తీసుకువెళ్లింది. అక్కడ డాక్టర్ మెడిసిన్ తెమ్మని తల్లిని మెడికల్ షాప్​కి పంపాడు. పాప పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పాప ఆ విషయం చెప్పడంతోనే... తల్లి పోలీస్ స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఎఫ్​ఐఆర్ నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం.

- రమేష్, పేట్ బషీరాబాద్ ఇన్​స్పెక్టర్

లోపలికి వెళ్లి వైద్యుడితో గొడవకు దిగింది. ఆ తర్వాత స్థానిక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి: World Breastfeeding Week: తల్లిపాలపై ఎన్నో అపోహలు.. అందులో నిజమెంత? అబద్ధమెంత?

Last Updated : Aug 4, 2021, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.