ప్రేమజంటను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో కానిస్టేబుల్ ఆకాశ్‌ను హైదరాబాద్ ఆనంద్ సీపీ సీవీ ఆనంద్ విధుల నుంచి తొలగించారు. ఈనెల 15న డైరీ ఫామ్ రోడ్డులో ప్రవీణ్ కుమార్ అనే యువకుడు తన స్నేహితురాలితో మాట్లాడటం గమనించి ఆకాశ్ వారిని బెదిరించాడు. అంతటితో ఆగకుండా వారి దగ్గరనుంచి రూ.15 వేలు వసూలు చేశాడు.
ఆ తరువాత కూడా బాధితులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో బాధితురాలు తన స్నేహితుడితో కలిసి బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆకాశ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సీవీ ఆనంద్ అతన్ని డిస్మిస్ చేశారు.
ఇదీ చదవండి: మనీ ట్రాన్స్ఫర్ చేసి.. క్యాష్ తీసుకున్నారా..? అయితే ఇది మీకూ జరిగుంటుంది..!
అప్పటివరకు పెళ్లిలో సరదా సరదాగా.. కాసేపటికే ఆరుగురు శవాలై...