ETV Bharat / crime

Dhanbad Cyber Gang : మన వారితో మనకే మస్కా.. బయటపడుతున్న ధన్‌బాద్‌ ముఠా పన్నాగాలు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Cyber Crimes With Telugu Youth : సైబర్‌ నేరాలు కొత్త పంథాలో జరుగుతున్నాయి. రోజుకో కొత్త తరహాలో కేటుగాళ్లు.. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూసే తెలుగు యువకులకు ఎరవేసి.. దారికి తెప్పించుకుంటున్నారు. ఇలా మనవారితోనే మనల్ని బురిడీ కొట్టిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

Cyber crimes with telugu youth, dhanbad gang
బయటపడుతున్న ధన్‌బాద్‌ ముఠా పన్నాగాలు
author img

By

Published : Jan 30, 2022, 8:26 AM IST

Updated : Jan 30, 2022, 8:54 AM IST

Cyber Crimes With Telugu Youth : సైబర్‌క్రైమ్‌ అనగానే గుర్తొచ్చేవి ఉత్తరాది ముఠాలు. తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న సైబర్‌ నేరాలకు మూలాలు ఉత్తరాదిలో కనిపిస్తుంటాయి. భరత్‌పూర్‌.. జామ్‌తారా.. దేవ్‌ఘర్‌.. దిల్లీ ముఠాల వంటివే తెలుగు రాష్ట్రాలపై పంజా విసురుతుంటాయి. ఇప్పటివరకు ఇదే జరిగింది. కానీ ఈ ముఠాలు కొత్త పన్నాగాలకు తెర తీశాయి. తెలుగు యువకులనే ఎంపిక చేసుకోవడం మొదలెట్టాయి. సంపాదన కోసం ఎదురుచూస్తున్న యువకులకు గాలమేసి దారికి తెచ్చుకుంటున్నాయి. భారీ మొత్తంలో కమీషన్ల ఆశచూపి సైబర్‌ నేరాలకు వినియోగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం రాచకొండ పోలీసులకు చిక్కిన ధన్‌బాద్‌ ముఠాను విచారించడంతో ఇలాంటి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తెలుగు, హిందీ తెలియడంతో..

Dhanbad Gang Cyber Crimes : ఝార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్‌కు చెందిన విక్రం ఠాకూర్‌ తెలుగు యువకులపై వలేశాడు. తెలుగు, హిందీ వచ్చిన వారిపై గురి పెట్టాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మకాం వేసి వనపర్తి జిల్లా పెద్దమందడికి చెందిన ఆటో డ్రైవర్‌ రాజుతో పరిచయం పెంచుకున్నాడు. తొలుత కాల్‌సెంటర్‌లో పనిచేసేందుకు యువకులు కావాలని చెప్పి.. తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. సైబర్‌ నేరాల ద్వారా జనాల్ని మోసగించి రాబట్టిన సొమ్ములో ఏకంగా 30శాతం ఇస్తామని చెప్పడంతో రాజు తన గ్రామానికే చెందిన మరో ఎనిమిది మంది యువకుల్ని(19-21 ఏళ్లు) ధన్‌బాద్‌ తీసుకెళ్లాడు. వారికి తెలుగుతోపాటు హిందీ కూడా వచ్చు. హైదరాబాద్‌లో చదువు లేదా ఉద్యోగం చేస్తున్నామని ఇళ్లలో చెప్పి రావాలని సూచించాడు. సైబర్‌ మోసాల్లో శిక్షణ ఇప్పించాడు. ఏడాదికాలంగా అక్కడి కాల్‌సెంటర్‌ ద్వారా మోసాలు చేయించాడు. ధన్‌బాద్‌లో వారి ఆహార్యం, కదలికలపై అనుమానమొచ్చిన స్థానికులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నిర్వాకం బహిర్గతం కావడంతో రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం పీటీ వారెంట్‌పై వారిని ఇక్కడికి తీసుకొచ్చారు.

‘పట్నా’ మరణాలపై అనుమానాలు

Cyber Crimes in Hyderabad : ధన్‌బాద్‌ ఉదంతంతో పదిహేను రోజుల క్రితం బిహార్‌ రాజధాని పట్నాలో చోటుచేసుకున్న ఉదంతం అనుమానాలకు తావిస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌కు చెందిన నలుగురు, వనపర్తి జిల్లా పెద్దమందడికి పక్కనే ఉన్న ఖిలాఘన్‌పూర్‌కు చెందిన మరొకరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కల్తీకల్లు తాగడం వల్లే వీరు మరణించారని అక్కడి పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ ధన్‌బాద్‌ ఉదంతంతో వారి మరణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. వారినీ ఇలాగే అక్కడి ముఠాలేమైనా సైబర్‌ నేరాలు చేయించేందుకు తీసుకెళ్లాయా అనే సందేహాలు ముసురుకుంటున్నాయి.

సైబర్‌ నేరాల విస్తరణలో కొత్త పంథా

Hyderabad Cyber Crimes : ఉత్తరాది సైబర్‌ నేరస్థుల ముఠాలు సాధారణంగా హైదరాబాదీలనే లక్ష్యంగా చేసుకునేవి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలపైనా మోసాల వల వేయాలని భావించి వ్యూహాలు అమలు చేశాయి. ఈక్రమంలోనే ఉభయ రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వారికి భారీ కమీషన్ల ఆశ చూపి మోసాలకు పురిగొల్పుతున్నారని పోలీసు వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా సైబర్‌ నేరస్థులు తెలుగులోనే మాట్లాడుతున్నారని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ధన్‌బాద్‌ ముఠాపై సైబరాబాద్‌లో 10, రాచకొండలో 3, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 1 కేసు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి ముఠాలు ఉత్తరాదిలో మరిన్ని ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: Brutal murder: వ్యక్తి దారుణ హత్య.. వేర్వేరు మండలాల్లో తల, మొండెం..

Last Updated : Jan 30, 2022, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.