ETV Bharat / crime

చైనాలో రుణాల యాప్‌ల రూపకల్పన.. గుర్తించిన పోలీసులు - హైదరాబాద్​ నేర వార్తలు

రుణ యాప్​లను చైనాలోని షాంఘైలో రూపొందించినట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను చైనీయుడు ల్యాంబో నుంచి సేకరించారు. రుణా యాప్​ల వేధింపులతో కొందరు ఆత్మహత్య చేసుకోవటంతో సీరియస్​గా తీసుకున్న పోలీసులు.. ఇప్పటికే చాలా మంది నిందితులను అరెస్ట్​ చేశారు.

Design of loan apps in China
చైనాలో రుణాల యాప్‌ల రూపకల్పన.. గుర్తించిన పోలీసులు
author img

By

Published : Jan 23, 2021, 8:48 AM IST

సులభంగా రుణాలిస్తామంటూ రూ.వేల కోట్లు కొల్లగొట్టిన రుణాల యాప్‌లను షాంఘైలో రూపొందించినట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. సంబంధిత ఆధారాలను చైనీయుడు ల్యాంబో నుంచి సేకరించారు. తెలుగురాష్ట్రాలు, బెంగళూరు, చెన్నై, ముంబయిలలో చిరువ్యాపారులు, యువతను ఆకర్షించి రూ.లక్షల్లో రుణాలిచ్చి.. గడువులోపు చెల్లించినా.. బెదిరించి 60శాతం వడ్డీ వసూలు చేశారని తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వేర్వేరుగా కేసులు నమోదు చేసినా చైనీయులను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు సంయుక్తంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రుణాల యాప్‌ల కేసుల్లో ఇప్పటి వరకు రూ.400కోట్లు స్తంభింపజేసిన పోలీసులు మరిన్ని ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు.

రూ.250కోట్ల వరకు రుణాలిచ్చారు.

యాప్‌ల ద్వారా రుణాలిచ్చేందుకు యత్నించిన చైనా కంపెనీలకు తొలుత ఆశించిన ఫలితాలు రాలేదు. లాక్‌డౌన్‌ ప్రభావం ప్రైవేటు ఉద్యోగుల జీతాలపై పడటంతో చైనా కంపెనీల పంటపండింది. ఎలాంటి పత్రాలు, వ్యక్తిగతపూచీ లేకుండా రుణాలిస్తామంటూ వాట్సాప్‌ ద్వారా లింకులు పంపుతుండడంతో లక్షలమంది ముందుకొచ్చారు. ఒక్కోరోజు గరిష్ఠంగా రూ.250కోట్ల వరకు రుణాలిచ్చారు. కేవలం నాలుగు నెలల్లోనే రూ.16వేలకోట్ల లావాదేవీలు నిర్వహించారు. ఇందులో సింహభాగం లావాదేవీలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

మహా పన్నాగం..

రుణాల యాప్‌లను రూపొందించి భారత్‌లో కంపెనీలు ప్రారంభించాలని ఎనిమిది మంది చైనీయులు అక్టోబరు, 2019లో నిర్ణయించారు. ఓ ప్రైవేటు కంపెనీలో కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జెన్నీఫర్‌, మరో కంపెనీలో ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న వాంగ్‌ జియాంగ్‌ షి కలిసి నవంబరులో దిల్లీకి వచ్చారు. మరో చైనీయుడిని రప్పించి వేర్వేరుగా మూడు సంస్థలను నవంబరులో ప్రారంభించారు. జెన్నీఫర్‌ దిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరులో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేయగా.. జియాంగ్‌ షి బెంగళూరుకు పరిమితమయ్యాడు. కంపెనీలు ప్రారంభించాక జెన్నీఫర్‌తో పాటు వచ్చిన చైనీయుడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మరో ఐదుగురు చైనీయులు వచ్చి కొద్దిరోజులు కార్యకలాపాలు పర్యవేక్షించారు. గతేడాది జనవరిలో షాంఘైలో ఉంటున్న ల్యాంబోను జెన్నీఫర్‌ పిలిపించింది. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ కాల్‌సెంటర్ల బాధ్యత అప్పగించి, ఆమె జకర్తాకు వెళ్లిపోయింది. మరోవైపు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల పరిశోధనలో తాజాగా వర్జిన్‌ ఐలాండ్స్‌లోని బ్యాంకుల్లో చైనీయులు బినామీ ఖాతాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అక్కడి నుంచి రూ.వందల కోట్లు షాంఘైకి బదిలీ అయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరో ముగ్గురు అరెస్ట్​

రుణయాప్‌ల వేధింపుల కేసులో మరో ముగ్గురు నిందితులను పేట్‌బషీరాబాద్‌, బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. రుణయాప్‌ల నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఈ నెల 2న పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధి గుండ్లపోచంపల్లిలో చంద్రమోహన్‌(36) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రుణయాప్‌లకు అనుసంధానంగా నడుపుతున్న మూడు కంపెనీలలో పనిచేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు బాలానగర్‌ డీసీపీ పద్మజ తెలిపారు.

దిల్లీ, బెంగళూరులో నిందితులు

దర్యాప్తులో భాగంగా 5 బృందాలుగా విడిపోయిన పోలీసులు దిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లో నిందితుల కోసం మకాం వేశారు. ఎట్టకేలకు ఫ్లాష్‌క్యాష్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న హరియాణా రాష్ట్రం, గుర్‌గావ్‌ నివాసి హేమంత్‌కుమార్‌జా(28)ను దిల్లీలో, జస్‌ఐటీ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో హెచ్‌ఆర్‌ మేనేజరుగా పనిచేస్తున్న బెంగళూరు నివాసి వి.మంజునాథ్‌(28), టీజీహెచ్‌వై ట్రస్టురాక్‌ ప్రైవేటు లిమిటెడ్‌ మేనేజరు అబ్దుల్‌ లౌక్‌(25)ను బెంగళూరులో పట్టుకున్నారు. నిందితుల వద్ద 2 ల్యాప్‌ట్యాప్‌లు, 5 చరవాణిలు, 7 బ్యాంకుల్లోని అకౌంట్లలో రూ.65 లక్షల నగదు స్వాధీనం చేసుకొని నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఎస్‌ఓటీ డీసీపీ సందీప్‌, సీఐ రమణారెడ్డి, పేట్‌బషీరాబాద్‌ సీఐ రమేష్‌, ఎస్సై శ్రీనివాస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రుణయాప్‌ల నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తే తప్పకుండా పోలీసుల్ని సంప్రదించాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని డీసీపీ సూచించారు.

ఇదీ చదవండి: లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన జూనియర్ అసిస్టెంట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.