ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించిన ఉపసర్పంచ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఉపసర్పంచ్ వడ్త్యా బాబురావు, ఆయన భార్య రంగమ్మ ప్రాణాలు కోల్పోయారు.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బోదియ తండాకు చెందిన బాబురావు బిటెక్ చదివారు. రాజకీయాలతో పాటు వ్యవసాయం చేస్తూ ఊళ్లోనే ఉంటున్నారు. రెండేళ్లుగా పత్తి, మిర్చి పంటలో నష్టం వస్తోంది. అప్పు చేసి పెట్టుబడి పెట్టగా వేధింపులు అధికమయ్యాయని మనస్తాపం చెందారు. ఈనెల 6న ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు.
భార్యాభర్త ఇద్దరు పిల్లల్ని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న బాబురావు ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉందని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చూడండి: ఉపసర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం