ETV Bharat / crime

ఆ 131 మంది రైతులకు రైతుబంధు ఇవ్వొద్దని అబ్కారీశాఖ ప్రతిపాదన

author img

By

Published : Mar 16, 2022, 5:43 PM IST

Updated : Mar 16, 2022, 10:23 PM IST

గంజాయి సాగు చేసిన 126 మంది రైతులు.. రైతుబంధు ఇవ్వొద్దని అబ్కారీశాఖ ప్రతిపాదన

17:34 March 16

ఆ 131 మంది రైతులకు రైతుబంధు ఇవ్వొద్దని అబ్కారీశాఖ ప్రతిపాదన

రాష్ట్రంలో గంజాయి సాగును కట్టడి చేసే దిశలో అబ్కారీ, పోలీసు శాఖలు పని చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిపై నిఘా పెట్టడంతో పాటు స్థానికంగా గంజాయి సాగుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఏయే జిల్లాల్లో, ఏయే గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతోంది.. ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నారు. పండిన గంజాయిని ఎవరికి విక్రయాలు చేస్తున్నారు.. వారు ఎక్కడికి తరలిస్తున్నారు తదితర అంశాలపై నిఘా పెట్టారు. అదేవిధంగా గ్రామాల వారీగా నిఘాను బలోపేతం చేసుకున్న ఈ రెండు శాఖలు ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను సమర్ధవంతంగా వాడుకుంటున్నారు.

పొలాలపై దాడులు

దీంతో గ్రామాల్లో గంజాయి సాగు గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుండడంతో అబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు... పొలాలపై దాడులు నిర్వహించి అంతర్‌ పంటగా సాగైన గంజాయిని ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా సంబంధిత రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు...ఎంత మోతాదులో పండిస్తున్నారు.....దానిని ఏవిధంగా మార్కెట్‌ చేసుకుంటున్నారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పొలాల్లో సోదాలు చేసిన అబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గంజాయి సాగు చేస్తున్న131 మంది రైతులను గుర్తించారు. వారందరిపై అబ్కారీ శాఖ అధికారులు గంజాయి కేసులు నమోదు చేశారు. ఇందులో ఎక్కువగా అదిలాబాద్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కేసులు నమోదైనట్లు అబ్కారీ శాఖ తెలిపింది.

131 మంది రైతులపై కేసులు

రాష్ట్రంలో మాదకద్రవ్యాలు, గంజాయి విక్రయాలు, వాడకం పెరిగిపోతుండడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల పోలీసు, అబ్కారీ శాఖలతో సమీక్ష నిర్వహించి మాదకద్రవ్యాలను కట్టడి చేయాలని, గంజాయి సాగు, సరఫరాలను నిలువరించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లు కేసులు నమోదైతే ఆ రైతులకు రైతుబంధు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. దీంతో మరింత కఠిన చర్యలకు పూనుకున్న అబ్కారీ శాఖ అధికారులు.. గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సాగు చేస్తున్న 131 మంది రైతులపై కేసులు నమోదు చేశారు.

109 మందికి రైతుబంధు నిలుపుదల!

ఈ రైతులకు సంబంధించిన పూర్తి వివరాలతో రైతుబంధు నిలుపుదలకు అబ్కారీ శాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరి సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 109 రైతులకు సంబంధించిన రైతుబంధు నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు సాగుచేస్తున్న రైతులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మిగిలిన వారికి గట్టి హెచ్చరికలు ఇచ్చినట్లవుతుందని... తద్వారా గంజాయి సాగుకు మక్కువ చూపకుండా ఉంటారని అబ్కారీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల నుంచి స్మగ్లింగ్‌ అవుతున్న గంజాయిని, హషిష్​ఆయిల్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు పోలీసు శాఖతో కలిసి గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు అబ్కారీ శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:

Last Updated : Mar 16, 2022, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.