ETV Bharat / crime

Student Attack: వృద్ధ యాచకురాలిపై డిగ్రీ విద్యార్థి విచక్షణారహిత దాడి.. వీడియో వైరల్​.. - వృద్ధ యాచకురాలిపై డిగ్రీ విద్యార్థి విచక్షణారహిత దాడి

Student Attack: ప్రభుత్వాస్పత్రి పరిసరాల్లో యాచిస్తూ జీవనం సాగిస్తోన్న వృద్ధురాలిపై ఓ యువకుడు విచక్షణ కోల్పోయి దాడి చేశాడు. అచేతనంగా ఉన్న ఆమెను కొట్టుకుంటూ.. రోడ్డుపై ఈడ్చుకెళ్తూ.. పాశవికంగా ప్రవర్తించాడు. ఈ దాడికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

degree Student Attack on 70 years old begger at shadnagar

author img

By

Published : Feb 9, 2022, 9:28 PM IST

వృద్ధ యాచకురాలిపై డిగ్రీ విద్యార్థి విచక్షణారహిత దాడి..

Student Attack: రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పురపాలికలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఫరూఖ్​నగర్​లో మతిస్థిమితంలేని 70 ఏళ్ల వృద్ధ యాచకురాలిపై డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థి విచక్షణారహితంగా దాడి చేశాడు. బుధవారం(ఫిబ్రవరి 9న) సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. కాసేపటి తర్వాత వృద్ధురాలి ఒంటిపై ఉన్న గాయాలను చూసి స్థానికులు ఆరా తీశారు. ఎవరికీ తెలియదనటంతో.. అక్కడే ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఆ దృశ్యాల్లో ఆ యువకుడి పైశాచికత్వం బయటపడింది.

గొరగొరా ఈడ్చుకెళ్తూ..

70 ఏళ్ల వయసున్న వృద్ధురాలు సిద్దమ్మ.. షాద్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో చాలా కాలంగా ఉంటోంది. యాచిస్తూ జీవనం కొనసాగిస్తోంది. అదే పరిసరాల్లో ఉంటున్న యువకుడు పర్వేజ్​.. డిగ్రీ చదువుతున్నాడు. "ఎప్పటిలాగే రోడ్డు పక్కన వృద్ధురాలు కూర్చొని ఉంది. అప్పటి వరకు కొంత దూరంలో నిల్చొని ఉన్న యువకుడు.. ఒక్కఉదూటున వృద్ధురాలి వద్దకు వచ్చాడు. అచేతనంగా ఉన్న ఆమెను కొట్టటం ప్రారంభించాడు. విచక్షణారహితంగా కొట్టుకుంటూనే.. ఆ బక్కప్రాణాన్ని రోడ్డుపై గొరగొరా ఈడ్చుకుంటూ వెళ్లాడు." ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.

సహనం కోల్పోయి దాడి..

ఈ వృద్ధురాలికి నిత్యం భోజనం కల్పిస్తున్న రజాక్ కుటుంబసభ్యులు, స్థానికులు.. ఈ విషయం తెలుసుకుని పర్వేజ్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న షాద్​నగర్ ఇన్​స్పెక్టర్ నవీన్ కుమార్.. యువకున్ని ఠాణాకు తీసుకువచ్చి విచారించారు. మతిస్థిమితం కోల్పోయిన వృద్ధురాలు తనను చూసి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లే సహనం కోల్పోయి దాడి చేశానని యువకుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. సుమోటోగా తీసుకుని కేసు దర్యాప్తు చేస్తామని ఇన్​స్పెక్టర్ నవీన్​కుమార్ వివరించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.