అనుమానాస్పద స్థితిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామ శివారులో జరిగింది. గ్రామానికి సుమారు కిలో మీటరు దూరంలో ఉన్న చెరుకు తోటలో అడవి పందుల కట్టడి కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగపైన పడి అతను మరణించి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఐదు రోజుల క్రితం జరిగినట్లుగా భావిస్తోన్న ఈ ఘటనలో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుని సమాచారం కోసం వెతకగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే అతను పొరపాటుగా అటు వైపుగా వెళ్లి విద్యుత్ ఘాతానికి గురై మరణించాడా? లేక మరేదైనా జరింగిందా అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఈజీ మనీ కోసం.. ఆన్లైన్ బెట్టింగ్ మాయలో పడుతున్న యువత