చెడపకురా చెడేవు అన్న సూక్తికి ఈ ప్రొఫెసర్ చేసిన పనే ఓ ఉదాహరణ. జీతం చెల్లించలేదన్న కోపంతో కళాశాల ఛైర్మన్‌పై కక్ష సాధించేందుకు చేసిన కుట్ర వికటించి కటకటాలపాలయ్యాడో విద్యావంతుడు. ఈ ఘటన రాచకొండ సైబర్‌క్రైం స్టేషన్ పరిధిలో జరిగింది.
ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచి అసభ్యకర పోస్టులు పెడుతున్న ఓ ప్రొఫెసర్‌ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు( a Professor who posted obscene in Facebook fake account). తమిళనాడుకు చెందిన సిరాజుద్దీన్(39).. ఘట్కేసర్ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో హయత్‌నగర్(hayath nagar kuntluru) పరిధి కుంట్లూరులోని ఓ కళాశాలలో పనిచేసేవాడు.
గతంలో పనిచేసిన సమయంలో కొవిడ్ కారణంగా యాజమాన్యం జీతాలు చెల్లించలేదు. జీతాల కోసం ఎన్నిసార్లు అడిగినా కళాశాల యాజమాన్యం స్పందించకపోవడం వల్ల ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. సదరు కళాశాల ఛైర్మన్ పేరుతో ఫేస్బుక్ నకిలీ ఖాతా తెరిచి అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. తన పేరుపై ఉన్న ఫేక్ ఖాతాను గుర్తించిన కళాశాల ఛైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: cyber crimes: గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతున్న ఆన్‌లైన్ నేరాలు