Fake RC and Aadhar cards seized: నకిలీ ఆర్‌సీలతో వాహనాలు ముఠా సభ్యులు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. భారీగా నకిలీ ఆర్సీలులు, రబ్బర్ స్టాంపుల స్వాధీనం చేసుకున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నకిలీ ధ్రువపత్రాల కేసులో ప్రధాన నిందితుడు కొత్తగూడెంలోని ఆర్టీఏ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. మరో కేసులో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న సయ్యద్ మోసిన్, శంకర్ చౌహన్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి... 55 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. వీరిద్దరిపై ఇదివరకే పీడీ యాక్ట్ నమోదైందని... చాలా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
'ఫేక్ ఆధార్, ఆర్సీ కార్డులు ఫ్రింట్ చేసి వాహనాలు విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశాం. 1,200 నకిలీ ఆర్సీ కార్డులు, 29 రబ్బర్ స్టాంపులు, 2ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్స్, 75 నకిలీ ఆధార్ కార్డులు సీజ్ చేశాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఈ దందా జరుగుతున్నట్లు విచారణలో తేలింది. సతీశ్, గణేశ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆర్టీఏ ఏజెంట్ అయిన బాషా వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని.. వెహికల్ బ్రోకర్ అయిన చంద్రశేఖర్‌కు ఇస్తున్నారు. ఆక్షన్‌లో ఉన్న వాహనాలను కొనుగోలు చేసి.. ఆర్టీఏ ప్రమేయం లేకుండా నకిలీ ఆర్సీలు తయారు చేస్తున్నారు.'
- స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ
ఇదీ చూడండి: Attack on forest officers: అటవీశాఖ అధికారులపై గిరిజనుల దాడి