హైదరాబాద్‌లో కార్లు అద్దెకు తీసుకుని సగం ధరకే అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు... వారి నుంచి 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు ఎక్కువ చెల్లిస్తామంటూ... నిందితులు కార్లను అద్దెకు తీసుకుంటున్నారు. తరువాత బ్యాంకు సీజ్ చేసిందని, ప్రభుత్వం వేలం వేసిన వాహనాలంటూ ఆ కార్లను సగం ధరలకే అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. నిందితులపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయని... జనవరిలో ఓ బాధితుడి చేసిన ఫిర్యాదుతో విషయం బయటపడిందని పేర్కొన్నారు. ఈ ముఠాలో పల్లె నరేష్ కుమార్ అనే వ్యక్తి కీలక వ్యక్తిని వెల్లడించారు.
తక్కువ ధర అని తొందరపడొద్దు...
ప్రజలు సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేటప్పుడు... అన్ని పత్రాలు సరిచూసుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు. వాహనాల వివరాలు ఆర్టీఏ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని పేర్కొన్నారు. తక్కువ ధరకు వాహనాలు అమ్ముతుంటే అనుమానించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానం వస్తే... పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండి: Bullets: కానిస్టేబుల్ బుల్లెట్ల బ్యాగ్ మాయం.. ఇలా దొరికింది!