గతంలో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడేవారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని ఒక్కసారి పెట్టుబడి పెడితే నెల రోజుల్లో రెట్టింపు ఇస్తామంటూ దగా చేస్తున్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్ ద్వారా డబ్బులను బదిలీ చేస్తే నెల తర్వాత రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపిస్తారు. ముందుగా కొందరికి రెట్టింపు డబ్బులు ఇస్తారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులను గుంజుతారు. న్యూశాయంపేటకు చెందిన యువకుడు తనతోపాటు బంధువుల నుంచి డబ్బులు తీసుకొని యాప్ ద్వారా సుమారు రూ.8 లక్షల వరకు మోసపోయాడు. హన్మకొండ అదే తరహాలో యువకుడు రూ.10 లక్షల వరకు కోల్పోయాడు. ఈ ఘటనలపై హన్మకొండ, సుబేదారి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి.
టెన్నిస్‌లో బెట్టింగ్‌కు పాల్పడి..
టెన్నిస్ ఆటపై ఉన్న క్రేజీని మరికొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. వరంగల్‌కు చెందిన యువకుడు ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన టెన్నిస్ క్రీడల్లో సెమిఫైనాల్, ఫైనాల్ మ్యాచ్‌లో వెబ్‌సైట్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. ఏకంగా సుమారు రూ.33 లక్షలను పోగొట్టుకున్నాడు. ఇంతేజార్‌గంజ్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వరుసగా సైబర్ నేరగాళ్లు పంజా విసరడంతో కమిషనరేట్ సైబర్‌క్రైం విభాగం అప్రమత్తమైంది. కేసు విచారణను వేగవంతం చేసింది. నిందితులను గుర్తించి వారి బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేసేందుకు ప్రయత్నిస్తోంది.
క్రెడిట్ కార్డు ఓటీపీ ద్వారా మోసాలు..
పలు బ్యాంకులు ఖాతాదారులు స్తోమతను బట్టి క్రెడిట్ కార్డులను అందజేస్తాయి. దానిని యాక్టివేట్ చేసుకునేందుకు ఓటీపీ వస్తుంది. వచ్చిన నంబరు ఎవరికి చెప్పకుండా బ్యాంక్ ఏటీఏం వద్దకు వెళ్లి ఎంట్రీ చేయాలి. ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులు తీసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లకు ఓటీపీ చెప్పడంతో వారి ఖాతాల నుంచి డబ్బులు మాయమయ్యాయి. దీనిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి: Land Grabbing: రామానుజా... కనవా ఈ కబ్జా!