ETV Bharat / crime

బ్యాంకు ఖాతాల కేవైసీ అప్​డేట్​ పేరిట మోసం.. ఇద్దరు సైబర్​ నేరగాళ్ల అరెస్ట్​

Cyber Fraud: బ్యాంకు ఖాతాల కేవైసీ పేరుతో పలువురు ఖాతాదారులను మోసం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను రాచకొండ సైబర్​ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు చరవాణులు, ఆరు క్రెడిట్‌ కార్డులు, నాలుగు డెబిట్‌ కార్డులు, ఓటర్‌ గుర్తింపు కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి లింక్​లను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Cyber Fraud
Cyber Fraud
author img

By

Published : Oct 14, 2022, 4:33 PM IST

Cyber Fraud: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల వినియోగం బాగా పెరిగింది. మోసాలకు పాల్పడే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా బ్యాంకు ఖాతాల కేవైసీ పేరిట పలువురు ఖాతాదారులను మోసం చేస్తున్న ఇద్దరు నేరగాళ్లను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన భగవాన్‌ సాహ్య శర్మ, సచిన్‌ సైనీ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి బ్యాంక్‌ ఖాతాదారులకు చరవాణుల్లో లింక్‌లు పంపి వాటిని క్లిక్‌ చేసి తమ బ్యాంకు ఖాతాల కేవైసీ అప్‌డేట్‌ చేసుకోమని చెబుతున్నారు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ పేరు, పాస్‌వర్డ్‌, వంటి వివరాలు లింక్‌ల ద్వారా సేకరించిన నేరగాళ్లు.. ఖాతాదారుల సొమ్ము కొల్లగొడుతున్నారని పోలీసులు తెలిపారు.

క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఓ బాధితుడి వద్ద నుంచి నిందితులు దాదాపు రూ.9 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరిపి.. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్ల నుంచి మూడు చరవాణులు, ఆరు క్రెడిట్‌ కార్డులు, నాలుగు డెబిట్‌ కార్డులు, ఓటర్‌ గుర్తింపు కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా లింకులను నమ్మి మోసపోవద్దని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.