ETV Bharat / crime

cyber crime complaint: అధిక లాభాల ఆశ చూపి.. నిండా ముంచేశారు!

అమాయకులనే లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసగాళ్లు నిండా ముంచుతున్నారు. తొలుత అధిక లాభాలు అంటూ ఆశచూపుతారు.. ముందుగా పెట్టుబడులకు కొంత మొత్తం లాభాలు అందించి ఎరవేస్తారు. అది నమ్మి అధిక పెట్టుబడులు పెట్టాక.. టోపీ పెట్టేస్తారు. ఇలాంటి ఘటనే(cyber crime complaint) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగింది.

cyber crime complaint, cyber crime in bhadradri kothagudem
సైబర్ నేరాలు, ఇల్లందులో సైబర్ క్రైం
author img

By

Published : Nov 7, 2021, 11:09 AM IST

సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో రెచ్చిపోతున్నారు. అమాయకుల అత్యాశనే ఎరగా వేసి... రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఆన్​లైన్ మార్కెటింగ్ పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.4,25,000 కొల్లగొట్టారు. చేసేది లేక బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయిచారు(cyber crime complaint).

లాభాల పేరిట..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన బాధితుడు ఆన్​లైన్ మార్కెటింగ్ ఆకర్షణీయమైన ప్రకటన చూసి ఆగస్టులో అందులో జాయిన్ అయ్యారు. రూ.10 వేలు పెట్టుబడి పెట్టి చేరిన బాధితుడు... ఆ తర్వాత ఆకర్షణీయమైన లాభాలు చూపించడంతో మొత్తంగా రూ.4,25,000 పెట్టుబడి పెట్టారు. రెండు నెలల వ్యవధిలోనే రూ.15 లక్షలు అతడి ఖాతాలో ఉన్నట్టు చూపించడంతో ఆనందపడ్డారు. ఆ డబ్బును తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఇక్కడే అసలు విషయం బయటపడింది. ఖాతాలో ఉన్న డబ్బులు తీసుకునేందుకు యత్నించగా రాకపోవడంతో... బాధితుడు వారిని సంప్రదించారు. అయితే డబ్బులు రావాలంటే మరో మూడు లక్షలు పెట్టుబడి పెట్టాలని వారు సూచించడంతో అనుమానం వచ్చిన బాధితుడు... పోలీసులను(cyber crime complaint) ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

cyber crime complaint, cyber crime in bhadradri kothagudem
క్రిప్టో కరెన్సీ కేసులో అరెస్టయిన నిందితులు

క్రిప్టో కరెన్సీ అంటూ..

అధిక లాభాలు అంటూ ఆశచూపుతారు.. ముందుగా పెట్టుబడులకు కొంత మొత్తం లాభాలు అందించి ఎరవేస్తారు. అది నమ్మి అధిక పెట్టుబడులు పెట్టాక.. ముఖం చాటేస్తారు. క్రిప్టో కరెన్సీ, బిట్‌ కాయిన్లతో కోటీశ్వరులు కావొచ్చంటూ.. ఇటీవల సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న పశ్చిమ బంగాకు చెందిన ముగ్గురు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నగంలో పలు కేసులు నమోదు కావడంతో పశ్చిమ బంగా వెళ్లిన పోలీసు ప్రత్యేక బృందం ఇక్రాం హుస్సేన్, నూర్ ఆలం, ఇజారుల్‌ని అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చింది. వారి నుంచి 6 సిమ్‌కార్డులు, 5 చరవాణులు, 3 బ్యాంకు చెక్కు బుక్కులు, 6 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లోని రూ.50 లక్షల నగదు నిలుపుదల చేశారు.

ఓ ముఠా అరెస్ట్

పశ్చిమ బంగా సిలుగురికి చెందిన ప్రధాన నిందితుడు చోటా భాయ్ స్థానికంగా ఓ బ్యాంకులో పని చేసే నూర్ ఆలంతో కలిసి 14 షెల్ కంపనీలు ఏర్పాటు చేశాడు. వీటి ద్వారా ఆన్‌లైన్‌లో పెట్టుబడులు సేకరించాడు. ఇక్రాం హుస్సేన్, ఇజారుల్‌లు స్థానికంగా గ్రామస్థులకు కమీషన్ ఆశచూపి 64 బ్యాంకు ఖాతాలు సమకూర్చారు. అధిక పెట్టుబడులు వస్తాయని.. నాంపల్లికి చెందిన బాధితుడి వద్ద రూ.86 లక్షలు కాజేశారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా నేరాలకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. పశ్చిమ బంగాలో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు చోటా భాయ్‌ కోసం గాలిస్తున్నారు.

పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్న ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం ఆందోళన కలిగించే విషయమే. అయితే అమాయకుల అత్యాశనే ఆసరాగా చేసుకొని లక్షలు కొల్లగొడుతున్నారు. అధిక లాభాల వంటి ప్రకటనల పట్ల ఇకనైనా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: asi dead: పెళ్లింట విషాదం.. తల్లి మరణవార్త విని ఏఎస్సై హఠాన్మరణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.