ETV Bharat / crime

Cyber Crime: అధిక లాభం పొందొచ్చని సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ

author img

By

Published : Aug 7, 2021, 7:52 PM IST

సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. కేటుగాళ్ల మాయ మాటలు నమ్మి అమాయకులు మోసపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి దాదాపు రూ. 9.35 లక్షలు కాజేశారు.

Cyber
సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపి

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందవచ్చని నమ్మించి సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రూ. 9.35 లక్షలు కాజేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర నగర్​కు చెందిన రాకేశ్​కు గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్​లో బిట్ కాయిన్ ట్రేడింగ్ గ్రూప్ లిమిటెడ్ అంటూ మెసేజ్ చేశారు. ముందుగా రాకేశ్​ రూ.10వేలు పెట్టుబడి పెట్టగా అధిక లాభంతో తిరిగి తన బిట్ కాయిన్ రూపంలో బదిలీ చేశారు.

అప్పటికీ రాకేశ్​ నమ్మకపోవడంతో వారు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్​లో కొందరు వ్యక్తులు తాము గత మూడు నెలలుగా అధిక లాభం పొందుతున్నామని రాకేశ్​ను నమ్మించారు. ఈ మాటలను నమ్మిన రాకేశ్​... ఒకేసారి రూ.9.35 లక్షల నగదును బదిలీ చేయగా ఎలాంటి స్పందన లేదు. పంపిన నగదు ఫ్రీజ్ అయిందని... అది రిలీజ్ చేయాలంటే మరికొంత పంపాలనడంతో బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కార్డు అప్​డేట్ చేయాలంటూ...

జీడిమెట్ల పరిధి షాపూర్ నగర్​కు చెందిన యాదగిరి... ఇటీవలే నూతన ఆర్​బీఎల్ క్రెడిట్ కార్డును తీసుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి కార్డును అప్​డేట్ చేయాలనడంతో నమ్మి వివరాలు, ఓటీపీలు తెలిపాడు. సైబర్ నేరగాళ్లు పలు విడతల్లో రూ. 95 వేలు ఖాతా నుంచి మాయం చేశారు. బాధితుడు మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: Vaccination: రాష్ట్రంలో కోటి మార్క్‌ దాటిన కరోనా టీకా పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.