బహుళ జాతి సంస్థ టీసీఎస్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఓ యువతిని సైబర్ నేరాగాళ్లు బురిడీ కొట్టించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన బాధితురాలి నుంచి రూ.లక్షకుపైగా కాజేశారు. ఉద్యోగం కోసం నౌకరి డాట్ కామ్‌లో ఇటీవల తన వివరాలతో రిజిస్టర్ చేసుకున్నట్లు ఆమె తెలిపారు. తనకు ఫోన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు... వివిధ రకాల ఫీజుల పేరిట రూ.లక్షకుపైగా వసూలు చేసినట్లు వాపోయారు.
డబ్బు ఇచ్చిన తర్వాత స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Rape: సోదరిపై అత్యాచారం..బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులు