ETV Bharat / crime

Cyber Fraud: మహేశ్‌ కోఆపరేటివ్ బ్యాంకుపై సైబర్‌ దాడి కేసులో ముమ్మర దర్యాప్తు - crime news

Cyber Fraud: హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌పై అమెరికా, కెనడా నుంచి నైజీరియన్లు సైబర్‌ దాడులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి ఐపీ చిరునామాలతో మహేశ్‌బ్యాంక్‌ ప్రధాన సర్వర్‌లోకి ప్రవేశించి గంటల వ్యవధిలో 12.9 కోట్లను కాజేశారు. ఈ సైబర్‌దాడి తీవ్రతను తగ్గించేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. వివిధ బ్యాంకు అధికారులను సంప్రదించి సుమారు మూడు కోట్ల రూపాయల వరకు నేరస్థుల పరం కాకుండా ఆపగలిగారు.

Cyber Fraud: మహేశ్‌ కోఆపరేటివ్ బ్యాంకుపై సైబర్‌ దాడి కేసులో ముమ్మర దర్యాప్తు

author img

By

Published : Jan 26, 2022, 3:13 AM IST

Updated : Jan 26, 2022, 5:12 AM IST

Cyber Fraud: మహేశ్‌ కోఆపరేటివ్ బ్యాంకుపై సైబర్‌ దాడి కేసులో ముమ్మర దర్యాప్తు

Cyber Fraud: ఏపీ మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్లోకి చొరబడి 12కోట్ల రూపాయలకు పైగా కాజేసిన కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది నైజీరియన్ల పనేనని తేల్చారు. శనివారం రాత్రి మహేశ్‌బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌ చేసి ఆదివారం సాయంత్రం వరకూ నగదు బదిలీ చేశారని గుర్తించారు. బ్యాంక్‌ ఖాతాదారులకు, ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన నగదును సరిచూసుకునేందుకు బ్యాంక్‌ సిబ్బంది ప్రయత్నించగా.. ఈ సైబర్‌దాడి బయటపడింది. వెంటనే బషీర్‌బాగ్‌లోని సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. వేగంగా స్పందించిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. మూడు కోట్ల రూపాయల వరకు నేరగాళ్ల చేతికి చిక్కకుండా కాపాడగలిగారు. ఈ మొత్తం వ్యవహారంలో ఖాతాదారుల వివరాలేవీ నేరగాళ్ల బారిన పడలేదని.. వాళ్లు వాటి జోలికి పోలేదని మహేశ్‌ బ్యాంక్‌ డీజీఎం బద్రీనాథ్ తెలిపారు.

నిర్వహణ సరిగ్గా లేని సర్వర్లను గుర్తించి..

ఖాతాదారుల సౌకర్యార్థం బ్యాంకులు ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఖాతా నిర్వహణ, నగదు జమ, ఉపసంహరణ అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. వేల మంది ఖాతాదారుల సమాచారం, లావాదేవీలన్నింటి కోసం బ్యాంకు నిర్వాహకులు సర్వర్లను నిర్వహిస్తున్నారు. ఈ సర్వర్లు హ్యాక్ కాకుండా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దపెద్ద బ్యాంకుల సర్వర్ల నిర్వహణ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కానీ సహకార బ్యాంకుల టర్నోవర్ తక్కువ మొత్తంలో ఉంటుంది. వందల కోట్లు ఖర్చు చేసి సర్వర్లను నిర్వహించడానికి యాజమాన్యం వెనకడుగు వేస్తోంది. దీంతో సైబర్ నేరగాళ్లు సర్వర్లను హ్యాక్‌ చేయడంలో సఫలమవుతున్నారు. నిర్వహణ సరిగ్గా లేని సర్వర్లను గుర్తించి వాటిని హ్యాక్ చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

జాగ్రత్తలు తీసుకోవాలి..

మహేశ్ బ్యాంకుకు చెందిన ప్రధాన ఖాతా హ్యాక్ అయిన కేసులో సైబర్ క్రైం పోలీసులు 4బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. . సర్వర్​ను ఎక్కడి నుంచి హాక్ చేశారనే విషయాన్ని తెలుసుకోవడానికి ఐటీ నిపుణులతో సాయం కూడా తీసుకుంటున్నాం. మహేశ్ బ్యాంకుకు చెందిన ఐటీ విభాగం సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నామని.. నగదు బదిలీ అయిన ఖాతాదారుల వివరాలు సేకరిస్తున్నాం. సర్వర్ హ్యాక్​ల విషయంలో బ్యాంకులన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -ఏఆర్ శ్రీనివాస్, అదనపు సీపీ

ఐపీ చిరునామాలు నిజమైనవేనా?

సైబర్‌ నేరస్థులు నగదు బదిలీ చేసుకునేందుకు ఉపయోగించిన అమెరికా, కెనడాల ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌(ఐపీ) చిరునామాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇవి నిజమైన చిరునామాలేనా? ప్రాక్సీమెయిల్స్‌ అయి ఉంటాయా? అని పరిశోధిస్తున్నారు. మరోవైపు బ్యాంకు ఐటీ నిపుణులు... సర్వర్‌ ఎలా హ్యాక్‌ అయిందనే విషయాన్ని తెలుసుకునే పనిలో ఉన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 26, 2022, 5:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.