ETV Bharat / crime

గంటగంటకు.. డబ్బులే డబ్బులు! - తెలంగాణ క్రైమ్ వార్తలు

పెట్టుబడి పెడితే చాలు.. ఎలాంటి వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. పెట్టుబడిని బట్టి గంటకు ఇంత చొప్పున చెల్లిస్తామంటూ వల విసురుతున్నారు సైబర్‌ నేరస్థులు. తొలుత తక్కువ పెట్టుబడి పెట్టి చూడాలని చెబుతారు. ఎంత ఎక్కువ పెడితే అంత డబ్బులొస్తాయనే ఆశ చూపి భారీగా పెట్టుబడులు పెట్టించి గుంజేస్తారు.

cyber-cheating-with-the-name-of-power-bank-app
గంటగంటకు.. డబ్బులే డబ్బులు!
author img

By

Published : May 17, 2021, 11:05 AM IST

కూకట్‌పల్లికి చెందిన బాధితుడు(29) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. సొంతగా వ్యాపారం చేసేందుకు రాజీనామా చేశాడు. రూ.2 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. కరోనా తీవ్రత దృష్ట్యా 20 రోజులు ఆగమని మిత్రుడు సూచించాడు. మరో మిత్రుడు ‘పవర్‌ బ్యాంక్‌’ యాప్‌ గురించి చెప్పగా అందులో రూ.2 లక్షలు రెండుసార్లు పెట్టుబడి పెట్టాడు. వారం పదిరోజుల్లోనే ఆ యాప్‌ మాయమైంది. ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. 100-150 మంది ఇతని స్నేహితులూ ఆ యాప్‌ బాధితులే.

అసలు నమ్మొద్దు

సజ్జనార్

ఊరికే డబ్బులు ఎవరూ ఇవ్వరు. చాలా మంది అత్యాశకు పోయి ముందు వెనుకా ఆలోచించకుండా ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అసలు కంపెనీ ఉందా.. లేదో.. కూడా తెలుసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ప్రకటనలను అసలు నమ్మొద్దు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలి.

-వీసీ సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ

రూ.600 నుంచి రూ.3 లక్షల వరకు..

రూ.600 నుంచి రూ.3 లక్షల వరకు పెట్టేందుకు అవకాశమిస్తారు. రూ.600 కడితే గంటకు రూ.12.5 చెల్లిస్తారు. రోజుకు రూ.300 అన్న మాట. అదే రూ.1.5 లక్షలు పెడితే గంటకు రూ.519, రూ.50వేలకు గంటలకు రూ.93.75 చొప్పున ఇస్తారు. ఏడాది వరకు ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ యాప్‌ల నిర్వాహకులు లింక్‌ను వాట్సాప్‌లో నేరుగా పంపించరు. ఫలానా యాప్‌లో సభ్యుల్ని చేర్పిస్తే కమిషన్‌ ఇస్తామంటూ నమ్మిస్తారు. వారికి లింక్స్‌ పంపించి.. ఒక రిఫరెన్స్‌ నంబర్‌ ఇస్తారు. కొత్తవారు ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. ఎంత రీఛార్జీ చేస్తే అంతకు తగ్గట్లుగా కమిషన్‌ వారికి చెల్లిస్తారు. ఈ యాప్‌ నిర్వాహకులెవరు.. కంపెనీ పేరు, రిజిస్టర్డ్‌ చిరునామా, ఇతరత్రా వివరాలేం అందుబాటులో ఉంచరు.

ఇదీ చూడండి: కన్నబిడ్డలను హత్య చేసిన తల్లి- కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.