gold seized at Shamshabad airport: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని లోదుస్తులు, ప్యాంటు, చొక్కాలో దాచిపెట్టిన బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నారు. మెుత్తం బంగారం 704 గ్రాములు కాగా దాని విలువ సుమారు రూ. 39.66 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: