ETV Bharat / crime

మిరప తోటలో గంజాయి సాగు.. 60 మొక్కలు ధ్వంసం - Cultivation of marijuanas in the chilli crop

సంగారెడ్డి జిల్లాలో మిరప తోటలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పీకేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

marijuana trees
గంజాయి మొక్కలు పీకివేత
author img

By

Published : Apr 28, 2021, 5:54 PM IST

సంగారెడ్డి జిల్లా మనురు మండలంలోని దూద్గొండలో ఎక్సైజ్ టాస్క్​ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన మానిక్ గౌడ్ పొలంలోని మిరప తోటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలికి చేరుకొని 60 మొక్కలను ధ్వంసం చేశారు.

నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్​ఫోర్స్ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: హుస్సేన్​సాగర్​లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.