ETV Bharat / crime

క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి.. నెత్తిన కుచ్చుటోపీ పెట్టి..!

Crypto Currency Fraud : సైబర్ నేరాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఏమాత్రం ఆగడం లేదు. రోజుకో కొత్త రూపు సంతరించుకుంటూ జనం నెత్తిన టోపీ పెడుతున్నారు. తాజాగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మించి భారీగా ముంచారు. పెట్టుబడి పెట్టాక సైబర్ నేరగాళ్లు యాప్‌ను బ్లాక్ చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా కేసుల సంఖ్య పెరుగుతోంది. క్రిప్టో కరెన్సీ, రుణయాప్‌ల నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధిక లాభాలంటూ వచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Crypto currency fraud
Crypto currency fraud
author img

By

Published : Dec 30, 2022, 9:00 PM IST

Crypto Currency Fraud : క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులతో అధిక లాభాలంటూ వచ్చే ప్రకటనలపై క్లిక్‌ చేయగానే వాట్సప్ గ్రూపులో యాడ్ చేసేందుకు రీడైరెక్ట్ అవుతుంది. అందులో వందల సంఖ్యలో కస్టమర్లు సభ్యులుగా ఉంటారు. తాను ఇంత పెట్టుబడి పెట్టానని.. ఊహించిన మొత్తం కంటే ఎక్కువగా లాభాలు వచ్చాయంటూ సందేశాలు పెడుతుంటారు. అవి చూసి నిజమేనని స్పందిచారంటే మీ ఖాతాలో డబ్బులు లూఠీ అయినట్లే. పెట్టుబడి పెడతామని పోస్ట్‌చేస్తే నిర్వాహకుడు లైన్‌లోకి వస్తాడు.

క్రిప్టో కరెన్సీకి చెందిన యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తాడు. అందులో వివిధ రకాల క్రిప్టో కరెన్సీ ట్రేడ్ అవుతూ కనిపిస్తాయి. తొలుత తక్కువ మొత్తం పెట్టి క్రిప్టో కరెన్సీ కొంటే లాభం వచ్చినట్లు వ్యాలెట్‌లో కనిపిస్తుంది. లాభం చూడగానే అధిక మొత్తంలో పెట్టుడులు పెట్టగానే వ్యాలెట్ మాయం అవుతుంది. విత్ డ్రా చేసుకునే ఆప్షన్‌ను సైబర్ నేరగాడు యాప్‌లో బ్లాక్ చేస్తాడు. మొబైల్‌ ఐపీ అడ్రస్‌ పని చేయకుండా సైబర్ నేరగాళ్లు బ్లాక్‌ చేస్తారు. బాధితుడు తేరుకొని ఫిర్యాదు చేసేలోపే బాధితుడు బదిలీ చేసిన నగదు వివిధ ఖాతాల్లోకి చేరిపోతుంది.

రెండు నెలల క్రితం అధిక పెట్టుబడులు వస్తాయని.. హైదరాబాద్ నాంపల్లికి చెందిన బాధితుడి నుంచి ఇదే తరహాలో రూ.86 లక్షలు కాజేశారు. బంగాల్‌లో ఉన్న ప్రధాన నిందితుడు చోటా భాయ్ నుంచి రూ.9 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గాంధీనగర్‌కు చెందిన శ్రీనివాస్ అనే బాధితుడు టెలిగ్రామ్‌లో ప్రకటన చూసి పలు దఫాలుగా రూ.27 లక్షలు పెట్టాడు. అందులోంచి ఒక్క రూపాయి తీసుకునేందుకూ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించాడు.

ఇటీవల మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ పేరిట భారీగా మోసపోయామని రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది బాధితులున్నామని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. గల్ఫ్‌కు పారిపోయిన ప్రధాన మోసగాడు దాదాపు రూ.4 వేల కోట్లు వసూళ్లు చేశారని బాధితులు వాపోయారు. డబ్బు అంతా ఆన్‌లైన్‌లోనే సేకరించారన్న బాధితులు ప్రభుత్వం జోక్యం చేసుకుని దుబాయ్‌లో మకాం వేసిన నిందితుల నుంచి డబ్బు రికవరీ చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు.

"మమ్మల్ని క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలొస్తాయని ఆశ చూపాడు. అలా మేము మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ పేరిట భారీగా మోసపోయాం. ప్రధాన మోసగాడు దాదాపు రూ.4 వేల కోట్లు వసూళ్లు చేసి గల్ఫ్‌కు పారిపోయాడు. ప్రభుత్వం జోక్యం చేసుకుని దుబాయ్‌లో మకాం వేసిన నిందితుల నుంచి డబ్బు రికవరీ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం" -బాధితులు

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులతో అధిక లాభాలంటూ మోసం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.