ETV Bharat / crime

MPTC photo as rowdy sheeter: రౌడీషీటర్‌ జాబితాలో ఎంపీటీసీ.. పోలీసుల తీరుపై విమర్శలు - తెలంగాణ వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లి పోలీసుల తీరుపై(MPTC photo as rowdy sheeter) విమర్శలు వస్తున్నాయి. స్థానిక ఎంపీటీసీ ఫొటోపై రౌడీషీటర్ అని రాసి.. నోటీస్ బోర్డులో పెట్టారని వ్యవహరిస్తున్నారని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MPTC photo as rowdy sheeter, kachanapalli police news
పోలీసుల తీరుపై విమర్శలు
author img

By

Published : Nov 23, 2021, 12:02 PM IST

MPTC photo as rowdy sheeter issue: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కాచనపల్లి పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. స్థానిక ఎంపీటీసీ ఫొటోపై రౌడీషీటర్‌ అని ముద్రించి....స్టేషన్‌ ఎదుట పెద్దగా ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. పోలీసుల తీరును ప్రశ్నించినందుకే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు అజ్మీరా బిచ్చ ఆరోపించారు. సివిల్‌ పంచాయతీలు, భూవ్యవహారాలు చేయటాన్ని ప్రశ్నించినందుకు కక్షగట్టారని అన్నారు. ఈ ఘటనపై నేతల అభ్యంతరాలను పరిశీలిస్తామని సీఐ తెలిపారు.

నాయకుల ఆగ్రహం

పోలీసుల తీరుపై సీపీఐ ఎంఎల్ ఎన్డీ నాయకులు((cpi ml new democracy leaders on police)) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్​ను సందర్శించిన నాయకులు... ఎస్సై సెలవుపై ఉండడంతో సిబ్బందితో మాట్లాడారు. సాధారణంగా నోటీస్ బోర్డులో చిన్న సైజులో ఏర్పాటు చేసే ఫోటోలకు భిన్నంగా పెద్ద సైజ్ ఫొటో ఏర్పాటు చేయడం ఏంటని రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణ ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో వైరల్

పోలీసుల తీరును ప్రశ్నించినందుకే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇలా వ్యవహరించడం సరికాదని పోటు రంగారావు ఆగ్రహం వ్యక్త చేశారు. ఒక ప్రజాప్రతినిధి అని చూడకుండా తెలంగాణ ఉద్యమకారులపై, ప్రశ్నించేవారిపై ఇలా చేసిన పోలీసుల తీరును ఖండిస్తున్నామన్నారు. కాగా ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఇదీ చదవండి: Cm Kcr on Paddy Purchase: 'ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరేంటో తెలుసుకుందాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.