ETV Bharat / crime

దారుణం... మత్తులో మదమెక్కి ఆవుపై అత్యాచారం.. మూగజీవి మృతి - Rape of cow in Yanam

Cow Brutally Raped in Yanam: గంజాయి మత్తులో ఆకతాయిలు మానవత్వం మరిచి, మూగజీవిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గుల అరాచకాలకు ఆ మూగ జీవి తాళలేక అసువులు బాసింది. ఈ అమానవీయ ఘటన ఏపీ కాకినాడకు సమీపంలోని యానంలో జరిగింది.

cow brutally raped in yanam
cow brutally raped in yanam
author img

By

Published : Jan 13, 2023, 12:13 PM IST

Cow Brutally Raped in Yanam: గంజాయి మత్తులో మదమెక్కి.. మతితప్పి, మానవత్వం మరచిన కొందరు పైశాచికంగా ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ మూగజీవి తనువు చాలించింది. ఆంధ్రప్రదేశ్​ యానాంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొబ్బరితోటలో బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పొగాకు ఈశ్వరరావు అనే రైతు స్వగృహానికి సమీపంలోని.. తన కొబ్బరి తోటలో ఆవుల కోసం ప్రత్యేకంగా పశువుల పాక ఏర్పాటు చేశాడు.

ప్రతీ రోజులాగే మేత కోసం ఆవులను పొలాల్లోకి తీసుకుపోయాడు. సాయంత్రానికి యదావిధిగా తిరిగి కొబ్బరి తోటలోని పాకకు ఆవులను చేర్చుతాడు. ఈ ప్రాంతం జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో.. అటుగా వెళ్తున్న కొందరు దుర్మార్గులకు ఆ పశువుల శాల కనిపించింది. వారితో పాటు తెచ్చుకున్న మత్తుపానీయాలను సేవించేందుకు ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా కనిపించింది. చుట్టు పక్కల జనజీవనం ఏమీ లేదు. ఇంకేముంది వారి అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.

ఆ మూగ జీవి అసువులు బాసింది: చివరికి మద్యం మత్తులో ఏమి చేస్తున్నారనేది వాళ్లకి తెలియని పరిస్థితిలో.. మూగ జీవిపై అత్యాచారం చేసినట్లు.. అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దుర్మార్గుల అరాచకాలకు ఆ మూగ జీవి తాళలేక అసువులు బాసింది. గురువారం తెల్లవారు జామున కొబ్బరితోటకు వెళ్లిన ఈశ్వరరావుకు ఆవు చనిపోయి ఉండటంతో చలించిపోయాడు. చనిపోయిన పరిస్థితులను బట్టి రైతు తీవ్ర మనోవేదనకు గురైయ్యాడు.

దీంతో వెంటనే ఆయన యానాం పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీ పెంచాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఊపిరాడక పోవడంతో ఆవు మృతి చెంది ఉంటుందని.. పుదుచ్చేరి పశు వైద్యాధికారి కదిరేశన్‌ తెలిపారు. జంతువుతో లైంగిక చర్యకు పాల్పడటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.