ETV Bharat / crime

బంజారాహిల్స్​లో చిన్నారిపై అత్యాచారం కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి - Four year old girl raped in DAV school

DAV School Incident Update: బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. కేసులో అరెస్టయిన డ్రైవర్‌, పాఠశాల ప్రిన్సిపల్‌ మాధవిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. శనివారం నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని లోతుగా ప్రశ్నించనున్నారు.

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి కస్టడీకి..కోర్టు అనుమతి

author img

By

Published : Oct 28, 2022, 10:31 PM IST

DAV School Incident Update: బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో అరెస్టయిన డ్రైవర్‌, పాఠశాల ప్రిన్సిపల్‌ మాధవిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని లోతుగా ప్రశ్నించనున్నారు. పాఠశాల డ్రైవర్‌కు ఈ ఘటనలో ఎవరు సహకరించారు అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. కస్టడీలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సి ఉంది.

నేర చరిత్రపై ఆరా.. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్​ రజినీ కుమార్ నేర చరిత్ర గురించి పోలీసులు ఇప్పటికే వివరాలు సేకరించారు. రజినీ కుమార్ మరికొంతమంది విద్యార్థినిలతోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రజినీ కుమార్ మొదటి భార్యకు విడాకులిచ్చి రెండో వివాహం చేసుకున్నాడు. కుమారుడు, కుమార్తె ఉన్నారు.

11 ఏళ్లుగా పాఠశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్ మాధవి దగ్గర కారు డ్రైవర్​గా పనిచేస్తున్న రజినీ కుమార్.. ఇతర ఉపాధ్యాయుల వద్ద అజమాయిషీ ప్రదర్శించేవాడని పోలీసులు గుర్తించారు. ప్రిన్సిపల్ వద్ద ఉండే వ్యక్తి కావడంతో ఇతర ఉపాధ్యాయులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించారు. దీన్ని అదునుగా తీసుకొని చిన్నారుల తరగతి గదుల్లోకి వెళ్లడం.. పిల్లల్ని డిజిటల్ క్లాస్ రూమ్​లోకి తీసుకెళ్లడం లాంటివి చేసేవాడు. ఈ క్రమంలోనే 4 ఏళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.