ETV Bharat / crime

COUPLE SUICIDE: కరోనా వేళ.. అప్పుల బాధ భరించలేక..

కరోనాతో అప్పులు భరించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. ఓవైపు పాఠశాల నడవక.. మరోవైపు తీసుకున్న అప్పు తీర్చాలని వడ్డీకి ఇచ్చిన వాళ్లు వేధించడం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోతున్న చివరి నిమిషంలో తీసిన సెల్ఫీ వీడియోతో ఈ ఘోరం వెలుగుచూసింది.

couple-suicide-due-to-appulu
కరోనా వేళ.. అప్పుల బాధ భరించలేక..
author img

By

Published : Aug 16, 2021, 10:29 AM IST

పాఠశాల స్థాపించినా.. ఫీజులు వసూలు కాకపోవడం.. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా..కరోనా ప్రభావంతో బడి మూతపడడం.. అప్పులిచ్చిన వారంతా ఒత్తిడి తేవడం వంటి కారణాలతో యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..కోవెలకుంట్లకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కర్నాటి రాధాకృష్ణమూర్తి కుమారుడు సుబ్రహ్మణ్యం (33), కోడలు రోహిణి (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

భార్యాభర్తలిద్దరూ గత నాలుగేళ్లుగా పట్టణంలో లైఫ్‌ ఎనర్జీ స్కూల్‌ నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు మండలం కరివెన సమీపంలో కారులో సుబ్రహ్మణ్యం, రోహిణి విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు చరవాణిలో సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్‌ చేయడంతో విషయం వెలుగుచూసింది.

కరోనా వేళ.. అప్పుల బాధ భరించలేక..

‘ఈ రోజు నేనూ.. నా భార్య చనిపోతున్నాం. అందరూ క్షమించాలి. విద్యార్థుల టీసీలు ఎంఈవో ఆఫీస్‌లో కలెక్ట్‌ చేసుకోండి. మాకు ఫీజులు రాక, అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో అవమానం భరించలేక ఇలా చేసుకోవాల్సి వస్తోంది.’

అంటూ వారు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియోలో వెల్లడించడం సంచలనం కలిగించింది. విషయం తెలిసి జనం వారి ఇంటి వద్దకు చేరారు. సుబ్రహ్మణ్యం భార్య రోహిణి స్వగ్రామం ఆత్మకూరు. వారు ఆత్మకూరు నుంచి కోవెలకుంట్లకు వస్తూ మార్గమధ్యంలో విష గుళికలు మింగారు. విషయం తెలుసుకున్న బంధువులు స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే భర్త మృతి చెందారు. రోహిణిని కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. స్కూల్‌ కోసం సుమారు రూ.2 కోట్ల వరకు అప్పుచేసి ఉంటారని స్థానికులు తెలిపారు. ఇద్దరి మృతితో వారి కుటుంబీకులు రోదించడం అందరినీ కలచివేసింది.

ఇదీ చదవండి: ARK REDDY: దేశంలోకి చొరబడి దాడులు చేసే అవకాశం ఉంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.