ఏపీలోని అనంతపురం జిల్లా మడకశిర మండలం హెచ్.ఆర్.పాలెంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. హెచ్.ఆర్.పాలెంలో చెట్టుకు ఉరేసుకుని.. యువతి, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మడకశిరలోని శివాపురం ప్రాంతానికి చెందిన వీరిద్దరూ.. గతంలో ప్రేమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ తర్వాత ఇద్దరికి వేర్వేరుగా వివాహాలయ్యాయి. అయినా పాత సంబంధం అలాగే కొనసాగించారని... ఈ విషయం తెలిసి పెద్దలు మందలించిన కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఎస్సై శేషగిరి బృందం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఇదీ చదవండి : భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష