పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన సొత్తుకు కాపాలా ఉండాల్సింది పోయి.. కాజేసి పరారయ్యాడు ఓ కానిస్టేబుల్. ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంచలన సృష్టించిన ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డబ్బులతో ఉడాయించిన కానిస్టేబుల్ జనార్ధన్ రెడ్డి.. పోలీసు గ్రూప్‌లో పెట్టిన ఓ సందేశం కలకలం రేపుతోంది.
"నేను అసలు ఏం బాలేను. ఐ హేట్ మై మ్యారిడ్ లైఫ్, ఐ హేట్ మై లైఫ్. నేను చనిపోయే ముందు ఓ వ్యక్తిని చంపుతాను. బీరువా తాళాలు నా క్వార్టర్స్‌లోనే ఉన్నాయి" అంటూ మెసేజ్ చేశాడు. కానిస్టేబుల్ సందేశంతో మరింత అలర్ట్ అయిన పోలీసులు... అతడి కోసం గాలిస్తున్నారు.