ETV Bharat / crime

Viral Video: ఆగిన గుండెకు ప్రాణం పోసిన కానిస్టేబుల్ - telangana news

కరీంనగర్‌లో ఆగిన ఓ గుండెకు ప్రాణం పోసి పలువురి ప్రశంసలు అందుకున్నాడు కానిస్టేబుల్ ఖలీల్. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న బాధితునికి సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ ప్రథమ చికిత్స చేశారు. నిముషం పాటు యువకుడి గుండెపై తన చేతులతో వత్తిడి పెంచి... గుండె పనిచేసేలా చేయడం స్థానికులను అబ్బుర పరిచింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చూసిన డీజీపీ మహేందర్‌రెడ్డి ఖలీల్‌ను ట్విటర్‌ ద్వారా అభినందించారు.

ఆగిన గుండెకు ప్రాణం పోసిన కానిస్టేబుల్
ఆగిన గుండెకు ప్రాణం పోసిన కానిస్టేబుల్
author img

By

Published : Jun 24, 2021, 9:03 AM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న బాధితున్ని సమయస్ఫూర్తితో వ్యవహరించి అతని ప్రాణాలను రక్షించిన కరీంనగర్‌ ఒకటో ఠాణా కానిస్టేబుల్‌ ఎం.ఎ.ఖలీల్‌ను... ట్విటర్‌ ద్వారా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. బొమ్మకల్‌కు చెందిన ఎం.డి.అబ్దుల్‌ ఖాన్‌ మంగళవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుతున్న క్రమంలో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనదారుడు అబ్దుల్‌ఖాన్‌ను ఢీకొట్టడంతో గాయపడి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు.

అపస్మారక స్థితిలో ఉన్న బాధితున్ని సమయస్ఫూర్తితో కాపాడిన కానిస్టేబుల్

అక్కడే విధులు నిర్వహిస్తున్న ఖలీల్ పరిశీలించగా యువకుడి గుండె ఆగిపోయింది. దీంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ సీపీఆర్ ప్రథమ చికిత్స చేశారు. నిముషం పాటు యువకుడి గుండెపై తన చేతులతో వత్తిడి పెంచాడు. ఆగిన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. అనంతరం వెంటనే అంబులెన్స్‌లో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఖలీల్ చేసిన చికిత్స స్థానికులను అబ్బుర పరిచింది.

ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. పరిశీలించిన డీజీపీ మహేందర్‌రెడ్డి ఖలీల్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించడమే కాకుండా, బాధితుని ప్రాణాలను రక్షించినందుకు ట్విటర్‌ ద్వారా అభినందించారు. ఈ విషయంపై కానిస్టేబుల్‌ ఖలీల్‌ చేసిన మంచి పనిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి సూచించారు. ఖలీల్‌ను సీపీ తన కార్యాలయంలో సన్మానించి వెయ్యి రూపాయలు నగదు రివార్డు అందించి అభినందించారు. విధి నిర్వహణలో ఓ మనిషి ప్రాణాలను రక్షించినందుకు హైదరాబాద్‌ ఏయిమ్స్‌ వైద్యులు ఎన్‌.సి.కె.రెడ్డి ఖలీల్‌కు రూ.3వేల నగదు అందించారు.

ఇదీ చదవండి: నీ ఇన్​స్టా ఫొటో మార్ఫింగ్ చేశా.. డబ్బివ్వకపోతే వైరల్ చేస్తా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.