తెరాస నేతలు ప్రచారానికి వెళ్తే.. ఎన్ని వాహనాలకైనా అనుమతి ఇచ్చి, తమను మాత్రం అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుమ్మచెట్టు తండా వద్ద.. ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్తోన్న వాహనాలను అడ్డుకోవడాన్ని.. వారు తీవ్రంగా ఖండించారు. రహదారిపై ఆందోళన చేపట్టారు.
సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి పర్యటించనున్న.. పలు గ్రామాలకు తుమ్మచెట్టు మీదుగా వెళ్తున్న వాహన శ్రేణిని పోలీసులు అడ్డుకున్నారు. కేవలం 6 వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలిపారు. ఆగ్రహంతో ఊగిపోయిన కార్యకర్తలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఇదీ చదవండి: రుణాలు ఇప్పిస్తానని రూ.4.5కోట్లు నొక్కేశాడు