సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో తెరాస పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కూచిపూడి గ్రామ సర్పంచ్ సురేశ్‌పై ఎంపీటీసీ వర్గీయులు దాడికి దిగారు. సర్పంచ్ తన అనుచరులతో లారీ నుంచి ట్రాక్టర్‌లోకి ఇసుకను అక్రమంగా డంపింగ్ చేస్తున్నారని ఎంపీటీసీ వర్గీయులు ఆయనపై దాడి చేశారు. గురువారం జరిగిన ఈ ఘర్షణలో ఇరు వర్గాలవారికి గాయాలయ్యాయి.
సర్పంచ్‌పై దాడి చేయడం అమానుషమని, తమకు న్యాయం చేయాలంటూ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌తో సహా ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ వర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. ఆ దాడుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: పట్నం వీడి... శివారు ప్రాంతాలకు పాకిన రేవ్ పార్టీ కల్చర్