ETV Bharat / crime

Fight between friends: స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తెరతో మెడపై దాడి - పిడుగురాళ్ల కనకదుర్గమ్మ గుడి వద్ద స్నేహితుల మధ్య ఘర్షణ

ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా అని మన తల్లిదండ్రుల స్నేహితులో.. ఇంటిపక్కన వారో అంటే మనకు చిర్రెత్తుకొస్తుంది. వీళ్లకెందుకు మన గురించి అని కోపం వస్తుంది. ఇలాగే.. ఓ యువకుడిని తన తండ్రి స్నేహితుడు హెయిర్ కటింగ్ మంచిగా చేయించుకోవాలని సూచించాడు. అంతే.. కోపమొచ్చిన ఆ యువకుడు.. నువ్వేంటి నాకు చెప్పేదని అతడిపై దాడికి దిగాడు.

స్నేహితుల మధ్య ఘర్షణ
స్నేహితుల మధ్య ఘర్షణ
author img

By

Published : Sep 5, 2021, 10:37 AM IST

ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని భవానీ నగర్​లో శనివారం రాత్రి ఇద్దరి స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. సూరగాని ఆంజనేయులు.. తన తండ్రితో కలిసి హెయిర్ కట్ చేయించుకునేందుకు సెలూన్​కు వెళ్లాడు. అక్కడే ఉన్న తన స్నేహితుడి తండ్రి చల్లా శ్రీనివాసరావు మంచి హెయిర్​ కట్ చేయించుకోమని చెప్పాడు.

కోపమొచ్చిన ఆంజనేయులు.. నువ్వేంటి నాకు చెప్పేదని అతడిపై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న శ్రీనివాసరావు కుమారుడు నాగేంద్రబాబు.. మా నాన్ననే కొడతావా అంటూ స్నేహితుడు ఆంజనేయులుపై గొడవకు దిగాడు. నువ్వేంటి నాకు చెప్పేదని ఆంజనేయులు ఎదురు దాడి చేశాడు. కోపం ఎక్కువై.. పక్కనే ఉన్న కత్తెర తీసుకుని నాగేంద్రబాబు మెడపై పొడిచాడు. తీవ్రగాయాలపాలైన నాగేంద్రబాబును స్థానికులు వెంటనే పిడుగురాళ్లలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

తన కుమారుడిపై దాడి చేసిన ఆంజనేయులుపై శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.