నేను సీఐడీలో ఉన్నతాధికారిని(CID officer harassment) .. నువ్విష్టమని చెబితే నన్నే కాదంటావా..? నువ్వు నాకు కావాలంతే అంటూ ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న ఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో తాజాగా వెలుగు చూసింది. బాధితురాలి(30) ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్(CID officer harassment) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన బాధితురాలికి గత నెల 29న కొత్త నెంబరు నుంచి ముందుగా వాట్సాప్(CID officer harassment) లో సందేశం వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి వీడియో కాల్స్ రావడం మొదలైంది.
బాగా నచ్చావు
నిన్ను ఓ వేడుకలో చూశా. అప్పుడే బాగా నచ్చావు. నీతో గడపాలని ఉంది... అంటూ బాధితురాలి(CID officer harassment) కి వాట్సాప్ సందేశం పంపించాడు. ఆ తర్వాత వీడియో కాల్ చేసి ఎక్కడికి రావాలో చెప్పు అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ.. వేధించడం మొదలు పెట్టాడు. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించాడు. బాధితురాలు చూసినట్లు డబుల్ టిక్స్ రాగానే వెంటనే డిలీట్ చేసేవాడు.
సీఐడీ అధికారినంటూ
సహనం కోల్పోయిన బాధితురాలు అసలు నువ్వెవరు..? ఎందుకిలా చేస్తున్నావంటూ నిలదీసింది. తాను సీఐడీ(CID officer harassment) విభాగంలో ఉన్నతాధికారిని అని చెప్పాడు. కొంతసేపటికి పోలీసు యూనిఫారంలో వీడియో కాల్ చేయడంతో ఆమె భయపడింది. వెంటనే ఆ నెంబరును బ్లాక్ చేసింది. ఆ తర్వాత మరో నెంబరు నుంచి మెసేజ్‌లు, వీడియో కాల్స్ రావడం మొదలైంది. నా నంబర్‌నే బ్లాక్ చేస్తావా..? నేను అడిగితే కాదంటావా అంటూ బెదిరింపులకు దిగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఇదీ చదవండి: Man arrested for cheating: అందంగా ఇన్‌స్టాలో ఫొటోలు పెట్టి... మహిళలకు గాలం...చివరకు...