చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని సింగిరి కోన వద్ద ఆలయానికి వెళుతున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేయటంతో వారికి తీవ్రగాయాలయ్యాయి.
వడమలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన దంపతులు మంజుల, సుబ్రహ్మణ్యం గుడికి వెళ్తామని నిర్ణయించుకున్నారు. పూలు, కొబ్బరికాయ సిద్ధం చేసుకున్నారు. ఆలయానికి వెళ్తున్నామని ఇంట్లో వాళ్లకు చెప్పారు. సుబ్రహ్మణ్యం ద్విచక్ర వాహనం నడుపుతుండగా.. మంజుల వెనక కూర్చుంది. మిత వేగంతో వెళ్తున్న వారి వాహనానికి చిరుత ఎదురొచ్చింది. చిరుతను చూసిన సుబ్రమణ్యం వేగం పెంచాడు. అయినా చిరుత వారి వెంటన పరిగెత్తింది. వారిపై దాడి చేయడంతో వారు కింద పడ్డారు. వారి కేకలు విన్న స్థానికులు అక్కడికి వచ్చేసారికి చిరుత వెళ్లిపోయింది. గాయాలపాలైన దంపతులను పుత్తూరులోని ఆసుపత్రికి తరలించారు. వారి క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు.
చిరుత చెట్ల పొదల్లో ఉంది. మీదికి వచ్చి దాడి చేసింది. అప్పటికి నేను వాహనాన్ని కొంత దూరం తీసుకెళ్లాను. అయినా మమ్మల్ని వెంటడుతూ వచ్చింది.
-సుబ్రహ్మణ్యం, బాధితుడు
ఇదీ చదవండి: టాటా ఏస్‌లో మంటలు.. చూస్తుండగానే దగ్ధమైన కారు