ETV Bharat / crime

Bitcoin Cheating: లక్షకు తొమ్మిది లక్షలంటూ సైబర్ నేరగాళ్ల మాయాజాలం

Bitcoin Cheating: బిట్​కాయిన్లు, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దిల్లీ, ముంబయి, కోల్​కతా, గుజరాత్ కేంద్రాలుగా మోసాలకు తెరలేపారు. మోసపోయిన బాధితులు సైబర్​క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Bitcoin
Bitcoin
author img

By

Published : Feb 18, 2022, 6:34 PM IST

Bitcoin Cheating: బిట్‌కాయిన్లు.. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే మూడు నెలల్లో రూ.లక్షకు తొమ్మిది లక్షలిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. టెలిగ్రామ్‌ మెసెంజర్, ట్విటర్‌లో ప్రచారం చేస్తూ యూట్యూబ్‌ లింకులు పంపుతూ క్రిప్టో కరెన్సీలో మదుపు చేయిస్తున్నారు. రూ.లక్షలు నగదు బదిలీ చేశాక ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. కొద్దినెలలుగా దిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు తాజాగా గుజరాత్‌లోనూ మోసాలకు తెరతీశారు. మెహసనా పట్టణంలో నివాసముంటున్న హితేశ్‌పటేల్, గోర్ధాన్‌బాయ్‌, మంగళ్‌దాస్‌ పటేల్‌లు స్వీక్స్‌ వాలెట్స్‌ పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు.

బాధితుడి ఫిర్యాదుతో...

ఓ బాధితుడి ఫిర్యాదుతో సైబర్‌క్రైం పోలీసులు 71 సంవత్సరాల మంగళ్‌దాస్‌ పటేల్‌ను గుజరాత్‌లో అరెస్ట్‌ చేయగా.. హితేశ్​ పటేల్‌ తప్పించుకున్నాడు. మంగళ్‌దాస్‌ను పోలీసులు విచారించగా... సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లోనూ వీరిద్దరిపై కేసులున్నాయి. ఇంతేకాదు మంగళ్‌దాస్‌ కొద్దిరోజుల క్రితం పట్టుబడ్డాడన్న సమాచారంతో రాజస్థాన్‌ పోలీసులు సైబర్‌క్రైం పోలీసులకు ఫోన్‌ చేశారు. తమకు అప్పగించాలంటూ అభ్యర్థించారు.

కొడుకు మోసాలు.. తండ్రి బుకాయింపు..

గుజరాత్‌లోని మెహసనా పట్టణంలో ఉంటున్న హితేశ్‌ పటేల్‌ కొద్దినెలల నుంచి క్రిప్టో కరెన్సీలో మదుపు చేయండి అంటూ సామాజిక మాధ్యమాలు, టెలిగ్రామ్‌ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఇతడి మాటలు నమ్మిన బాధితులు రూ.లక్షల్లో అతడికి నగదు బదిలీ చేశారు. మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారన్న ముందస్తు అంచనాతోనే హితేశ్‌ పటేల్‌ తాను నిర్వహిస్తున్న స్వీక్స్‌ వాలెట్స్, నరాద్‌పే, బుల్‌రన్‌ వంటి మొబైల్‌ యాప్‌ల చిరునామా, నగదు జమచేయాల్సిన ఖాతాలను తన తండ్రి గోర్ధాన్‌బాయ్‌ పటేల్‌ పేరుతోనే వ్యవహరించాడు.

నాటకం...

హితేశ్‌ సూచించిన మొబైల్‌ యాప్‌లలో నగదు బదిలీ చేసిన బాధితులు కొద్ది రోజుల తర్వాత అతడిని డబ్బుల కోసం నిలదీయగా.. ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసేవాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు మెహసనాలోని హితేశ్‌ పటేల్‌ ఇంటికి వెళ్లారు. తన కుమారుడు అమెరికాలో ఉన్నాడని.. తనకేం తెలీదని గోర్దాన్‌బాయ్‌ బుకాయించాడు. మోసపోయామంటూ ఫిర్యాదు చేసిన బాధితులకు కొంత మొత్తం ఇస్తానంటూ కేసులు వాపస్‌ తీసుకోవాలంటూ అభ్యర్థించాడు. అయితే ఇక్కడి నుంచి మెహసనాకు వెళ్లిన సైబర్‌క్రైం పోలీసులు 2, 3 రోజులు గోర్ధాన్‌బాయ్‌ కదలికలపై నిఘా ఉంచారు. తండ్రీకొడుకులు నాటకమాడుతున్నారని గ్రహించారు. గోర్ధాన్‌బాయ్‌ని అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చి జైలుకు పంపించారు.

బిట్‌కాయిన్లు.. క్రిప్టో కరెన్సీ భద్రం..

బిట్‌కాయిన్‌ ప్రస్తుత విలువ రూ. 36 లక్షలుందని.. బిట్‌కాయిన్‌లో 1,000వంతు కొన్నా లాభాలొస్తాయని సైబర్‌ నేరగాళ్లు ఆశపెడుతున్నారు. బిట్‌కాయిన్లు, క్రిప్టో కరెన్సీ పేరుతో డిజిటల్‌ నగదు లావాదేవీలు నిర్వహించేవారు జాగ్రత్తలు పాటించాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచించారు.

* క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్లను కొనుగోలు చేసేవారు షేర్ల క్రయవిక్రయాలకు డీమ్యాట్‌ ఖాతా ఉపయోగిస్తున్నట్టే ప్రత్యేకంగా ఒక బ్యాంక్‌ఖాతా లేదా వ్యాలెట్‌ నిర్వహించాలి.

* బిట్‌కాయిన్లు కొంటే రెండురోజులు, రెండునెలల్లో అనూహ్యంగా లాభాలు రావు. మూడు నెలల్లో రూ.9 లక్షలు రావడం అసాధ్యం.

* క్రిప్టో కరెన్సీ ఊహాజనితం.. కొనుగోళ్లు, అమ్మకాలున్నంతవరకూ డిజిటల్‌ నగదుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఒక్కసారిగా కొనుగోళ్లు ఆగిపోతే భారీగా నష్టాలొస్తాయి. మన వ్యాలెట్‌లో ఉన్నా.. వాటికి ఉపయోగం ఉండదు.

* షేర్‌మార్కెట్‌లో బహుళజాతి సంస్థలు, కంపెనీలు, ఇతర సంస్థలుంటాయి. వాటి ముఖవిలువల ఆధారంగా షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలుంటాయి. క్రిప్టో కరెన్సీలో అలాంటివి ఉండవు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.