వృద్ధాశ్రమంలో పర్యవేక్షకుడిగా ఉన్న ఓ యువకుడు.. ఓ వృద్ధుడి ఏటీఎం కార్డును దుర్వినియోగం చేసి రూ. 1. 57 లక్షలను కొల్లగొట్టాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని నాగోల్లో ఇది జరిగింది.
ఉప్పుగూడకు చెందిన నిందితుడు రామకృష్ణ.. నాగోల్‌లోని ఓ వృద్ధాశ్రమంలో పర్యవేక్షకుడిగా పని చేసేవాడు. ఆశ్రమానికి చెందిన ఓ వృద్ధుడు.. ఏటీఎం ద్వారా ఆన్లైన్లో తనకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి రామకృష్ణను సాయమడిగేవాడు. ఈ క్రమంలో.. రామకృష్ట ఆ ఏటీఎం కార్డుతో తరచూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో వంటి సైట్లలో కొనుగోళ్లు చేసి రూ. లక్షలు దుర్వినియోగం చేశాడు. బాధితుడితో ఫిర్యాదుతో.. అసలు విషయం బయటపడింది.
ఇదీ చదవండి: KTR responds: చిన్నారులకు కేటీఆర్ ఆపన్నహస్తం