హైదరాబాద్ చందానగర్‌కి చెందిన స్టాఫ్‌నర్స్ నాగచైతన్య హత్యకేసులో నిందితుడు కోటిరెడ్డిని పోలీసులు రిమాండ్‌కి తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న అతడిని పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. పథకం ప్రకారమే నాగచైతన్యను హత్య చేసినట్లు కోటిరెడ్డి పోలీసులకు తెలిపారు. ఈనెల23న హైదరాబాద్ వచ్చిన కోటిరెడ్డి లాడ్జ్‌కి వెళ్తామంటూ నాగచైతన్యకు ఫోన్ చేశాడు. ఓ సూపర్ మార్కెట్‌లో కూరగాయలు కోసే కత్తిని కొనుగోలు చేసి అక్కడకి తీసుకెళ్లాడు.
ఆమె నిద్రలో ఉండగా గొంతుపై కత్తితో దాడిచేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం రక్తం అంటిన చేతులు శుభ్రం చేసుకొని ఈనెల 24న గదికి తాళం వేసి ఒంగోలు వెళ్ళాడు. అక్కడ తన ఒంటిపై గాయాలు చేసుకొని ఆసుపత్రిలో చేరాడు. గాయాలపై ఆస్పత్రి వర్గాలు ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవదికి చెందిన నాగచైతన్య(24) హైదరాబాద్ నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. గుంటూరు జిల్లా రెంట చింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్ రిప్రజంటేటివ్. విధుల్లో భాగంగా ఇద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆరు నెలల నుంచి పెళ్లి చేసుకోవాలంటూ నాగచైతన్య.. కోటిరెడ్డిపై ఒత్తిడి తెస్తోంది. సామాజిక వర్గాలు వేరు కావడంతో కోటిరెడ్డి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నెల 23న నల్లగండ్లలోని ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నారు. ఆదివారం రాత్రి వరకు తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి తెరిచారు. నాగచైతన్య రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించగా.. కోటిరెడ్డి జాడ కనిపించకపోవడంతో చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:
స్టాఫ్‌నర్స్, మెడికల్ రిప్ క్రైం లవ్‌స్టోరి.. సినిమా స్టైల్లో ప్లాన్ వేశాడు కానీ..!